![Python Swallows Monkey in Khammam](/styles/webp/s3/article_images/2017/10/9/Python.jpg.webp?itok=FvPFnkB7)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కారేపల్లి : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడు శివారులోని అటవీ ప్రాంతంలో సోమవారం కొండచిలువ ఓ కోతిని మింగింది. తోటి వానరాన్ని పాము మింగేయడంతో కోతుల మంద పెద్ద పెద్దగా శబ్దాలు చేస్తూ హడావుడి సృష్టించాయి. ఇది గుర్తించిన స్థానిక రైతులు అక్కడికి చేరుకొని కోతిని మింగిన కొండచిలువను కర్రలతో కొట్టి చంపారు.
అనంతరం దాని కడుపులోని కోతిని బయటకు తీయడానికి యత్నించినా లాభం లేకపోయింది. అప్పటికే కోతి మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment