వడోదర: భారీ కొండచిలువ ఏకంగా ఓ కోతిని మింగేసింది. తరువాత కదల్లేక నదిలో ఉండిపోవడాన్ని అటవీ సిబ్బంది గమనించారు. పదడుగుల పొడవైన ఈ కొండచిలువను గుజరాత్ అటవీశాఖ అధికారులు మంగళవారం రక్షించారు. వడోదరలోని చిన్న నదిలో దీన్ని గుర్తించారు.
ముగ్గురు రక్షకులు నది నుండి దీనిని బయటకు తీసారని, అనంతరం మింగేసిన కోతిని వాంతి చేసుకుందని గుజరాత్ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పైథాన్ ఆరోగ్యం బాగానే ఉందని అటవీ అధికారి శైలేష్ రావల్ తెలిపారు. ఈ కొండచిలువను బోనులో సురక్షితంగా ఉంచినట్టు వెల్లడించారు. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామన్నారు.
Gujarat Forest Department officials rescued a 10-foot long python from a small river in Vadodara.
— ANI (@ANI) August 10, 2021
"It had swallowed a monkey and later unswallowed it. Python is in a good situation. We will release it in jungle once permission is obtained," said Shailesh Rawal, rescuer (09.08) pic.twitter.com/6DUUP00Ux9
Comments
Please login to add a commentAdd a comment