మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు మండలం చిన్నరాయిగూడెంలో అరుగురు అనుమానిత వ్యక్తులను పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రథం గుట్ట సమీపం నుంచి ఆటోలో వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో ఖమ్మం జిల్లాతోపాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.