ఎరుపురంగు బ్యానర్‌ను కాల్చుతున్న స్థానికులు
సాక్షి, కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకాలోని తాడుగుడ, పెండ్రీ గ్రామాల్లో మావోయిస్టుల ఎరుపురంగు బ్యానర్లు వెలిశాయి. ఆదివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఆయా గ్రామాల్లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఆ ఎరుపురంగు బ్యానర్లలో తెలిపారు. దీంతో స్థానికులు తమ గ్రామాలకు మావోయిస్టులు రావద్దని, అభివృద్ధి నిరోధకులని ఆ బ్యానర్లను స్థానికులు తీసు నాలుగు కూడళ్ల వద్ద నిప్పంటించి తగులబెట్టారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా గ్రామాల్లో పోలీసులు కూంబింగ్ తీవ్రం చేశారు. కాగా శనివారం ఏటపల్లి తాలూకా గట్టపల్లి అడవుల్లో రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో అక్కడి 10 జేసీబీలు, 5 ట్రాక్టర్లను మావోయిస్టులు కాల్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టులు మెరుపుదాడులకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే యాక్షన్ టీంలు సంచిరిస్తున్నట్లు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని గోదావరి సరిహద్దుల్లో పోలీసులు నిఘాను తీవ్రం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment