సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో సంచలనంగా మారింది. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడండి అంటూ ఆరిజన్ డెయిరీ పేరుతో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, మీడియా సంస్థలకు విన్నపం. మాకు న్యాయం చేయాలి’’ అని ప్లెక్సీలో ఉంది.
ఎమ్మెల్యేపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో
Comments
Please login to add a commentAdd a comment