mla durgam chinnaiah
-
వ్యతిరేకతను అధిగమించి హ్యాట్రిక్ కొడతారా?
ఆ ఎమ్మెల్యే మీద ఊళ్ళకు ఊళ్ళే తిరగబడుతున్నాయట. మా ఊళ్ళోకి రావద్దని ప్రజలు అడ్డగిస్తున్నారట. పొలిమేరలోనే అడుగుపెట్టనీయడంలేదట. అభివృద్ధి చేయని ఎమ్మెల్యేకు ఈసారి ఓటడిగే హక్కులేదని తేల్చి చెబుతున్నారట. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన నియోజకవర్గం ఎక్కడుంది? మరి ప్రత్యర్థి అయినా అక్కడ బలంగా ఉన్నారా? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుండి గత రెండు ఎన్నికలల్లోనూ దుర్గం చిన్నయ్య విజయం సాధించారు. మళ్లీ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఆశిస్తున్నారు. సింగరేణి కాలరీస్ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారికి చిన్నయ్య పట్టాలు ఇప్పించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా నిర్మించి పేదలకు పంపిణీ చేశారు. కొన్ని గ్రామాలకు మాత్రం రోడ్లు నిర్మించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలు మినహా..తన మార్క్ చూపించుకోవడానికి నియోజకవర్గంలో చేసిందేమీ లేదనే అపవాదును ఎదుర్కొంటున్నారు. బెల్లంపల్లిలో మెడికల్ కాలేజ్.. బస్సు డిపో ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. పక్కనే ఉన్న మంచిర్యాలలో మెడికల్ కళశాల నిర్మాణమై తరగతులు కూడా మొదలయ్యాయి. బస్సు డిపో చెన్నూర్ కు మంజూరైనా..బెల్లంపల్లికి మాత్రం రాలేదు. ఎమ్మెల్యే వైఫల్యం వల్లనే మెడికల్ కళాశాల, బస్సు డిపో రాలేదని ప్రజల్లో చర్చ సాగుతోంది. ఇవే కాదు.. మారుమూల ప్రాంతాల్లో ఏమాత్రం ప్రగతి లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కనీస వసతులులేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామాలకు ఎమ్మెల్యే వెళితే అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. పదేళ్ళుగా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారా అంటూ..ప్రజలు అడ్డుకుంటున్నారు. తమ గ్రామంలోకి రాకుండా ఆపివేసి ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేయకపోవడం, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడం ఒక భాగం అయితే..అరిజన్ కంపెనీ ప్రతినిధి షేజల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరువు తీసేసాయి. మహిళా ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత పెరిగినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. చిన్నయ్య అసమర్థత, ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువంటి ఎమ్మెల్యేను ఓడించాలంటూ ప్రజల్లో ప్రచారం చేస్తోంది. అయితే ఎవరెంత ప్రచారం చేసుకున్నా తన విజయాన్ని ఎవరూ ఆపలేరనే ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే చిన్నయ్య. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి గడ్డం వినోద్ ఓటమి చెందారు. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ..దుర్గం చిన్నయ్య మీద వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి గడ్డం వినోద్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌కు ఊపు రావడం కూడా వినోద్‌కు కలిసివస్తుందంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ప్రచారం సందర్భంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందట. ప్రజల స్పందనే వినోద్‌లో గెలుపు పై ధీమాను పెంచుతున్నాయట. కాని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగరరావు వర్గం వినోద్‌కు వ్యతిరేకంగా పని చేస్తోందట. పార్టీలోని వర్గ విభేదాలు వినోద్‌కు ఆందోళన కలిగిస్తున్నాయట. ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ధీటుగా కమలం పార్టీ కూడా ఎన్నికల యుద్ధం చేస్తానంటోంది. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాని బెల్లంపల్లి నియోజకవర్గంలో కమలం పార్టీకి బలం లేదు. మాజీ ఎమ్మెల్యేగా ప్రజల్లో తనకు పలుకుబడి ఉందని..తనకున్న ప్రజాదరణే ఈసారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపిస్తుందని శ్రీదేవి భావిస్తున్నారు. అయితే గత ఎన్నికలలో బిజెపికి ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ అభ్యర్థి శ్రీదేవి. ముక్కోణపు పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి. -
నోరు జారిన ఎమ్మెల్యే చిన్నయ్య..
-
‘ఆ ఎమ్మెల్యే కామ పిశాచి’.. హైదరాబాద్‌లో ఫ్లెక్సీల కలకలం..
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలసిన ఫ్లైక్సీలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో సంచలనంగా మారింది. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుంచి బెల్లంపల్లి ప్రజలను కాపాడండి అంటూ ఆరిజన్ డెయిరీ పేరుతో ఫ్లైక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, మీడియా సంస్థలకు విన్నపం. మాకు న్యాయం చేయాలి’’ అని ప్లెక్సీలో ఉంది. ఎమ్మెల్యేపై ఓ మహిళా తీవ్ర ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తమను నమ్మించి మోసం చేశారంటూ అరిజిన్ పాల సంస్థ భాగస్వామి శైలజ ఆరోపించారు. తమ డబ్బులు తీసుకొని, తిరిగి తమ మీదనే కేసులు బనాయించి రిమాండ్‌కు పంపించాడని తెలిపారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆడియో -
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్
-
అంజన్నా.. మన్నించు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సాక్షి దినపత్రిక జిల్లా ప్రతినిధి పోలంపల్లి ఆంజనేయులుకు క్షమాపణలు చెప్పారు. నెన్నెల మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై సాక్షిలో వరుస కథనాలు రాసినందుకు గాను ఆంజనేయులుపై ఎమ్మెల్యే చిన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా జర్నలిస్టు సంఘాలు గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. స్పందించిన ఎమ్మెల్యే చిన్నయ్య తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను సాక్షి ప్రతినిధిపై చేసిన అనుచిత వాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. మనసులో ఉన్న బాధను జర్నలిస్టు మిత్రులతో పంచుకునే క్రమంలో ఒకటి రెండు వ్యాఖ్యలు తప్పుగా దొర్లాయని పేర్కొన్నారు. అలాంటి మాటలు అన్నందుకు చింతిస్తున్నానని, తనను పెద్ద మనసుతో మన్నించాలని చేతులు జోడించి వేడుకున్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినీ దూషించాలనేది తన ఉద్దేశం కాదని తెలిపారు. ఇకపై ఎన్నడూ ఎవరి మనసులు నొచ్చుకోవద్దనేది తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిలువేరి నర్సింగం, ఆత్మ బెల్లంపల్లి డివిజన్ అధ్యక్షుడు ఎస్.బాణయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్.సత్యనారాయణ, కౌన్సిలర్లు బి.రాజేశ్వర్, ఎలిగేటి శ్రీనివాస్, ఎల్.రాములు, జిలకర వాసు, ఎస్కే.యూసుఫ్, సముద్రాల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మునిమంద రమేష్, దెబ్బటి రమేష్, భీమ శంకర్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే చిన్నయ్య వ్యాఖ్యలపై నిరసనలు
మంచిర్యాలటౌన్ : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ‘సాక్షి’ దినపత్రిక మంచిర్యాల జిల్లా ప్రతినిధి పోలంపల్లి ఆంజనేయును కించపరిచే విధంగా మాట్లాడినందుకు గాను గురువారం ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్ధతు పలికారు. దీంతో దిగివచ్చిన ఎమ్మెల్యే బెల్లంపల్లిలోని తన క్యాంపు కార్యాయలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిస్తూ క్షమాపణ కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో... జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఐబీ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అం దించిన అనంతరం వారు మాట్లాడారు. ప్రజా సమస్యలను నిజాయతీగా వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షి ప్రతినిధి ఆంజనేయులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై కథనాలు రాసే విలేకర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, మరోసారి ఇలాంటివి పునరావృతం అయితే ఎమ్మెల్యే సమావేశాలను బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. జర్నలిస్టుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు. ధర్నాలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి యెర్రం ప్రభాకర్, కార్యదర్శి సిహెచ్.శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి సంతోశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కాచం సతీశ్, జిల్లా ఉపాధ్యక్షుడు డేగ సత్యం, ఈసీ మెంబర్లు జి.సతీశ్, ఎం.రవి, ఎన్.రమేశ్, కె.వంశీకృష్ణ పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో... బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్ తరుపున జర్నలిస్టులంతా రోడ్డుపై గంటన్నర రాస్తారోకో చేశారు. వీరికి మద్ధతుగా సీపీఐ రాష్ట్ర నాయకులు గుండా మల్లేశ్, జెడ్పీటీసీ ఫోరం అధ్యక్షులు, బీజేపీ నాయకులు కొయ్యాల ఏమాజీ, బీజేపీ జిల్లా ప్రదాన కార్యదర్శి బి.కేశవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని జర్నలిస్టులకు మద్ధతు తెలిపి, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జన్నారం మం డల కేంద్రంలో ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. దండేపల్లిలో జర్నలిస్టులు నిరసన తెలిపిన అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. చెన్నూరులో జర్నలిస్టులంతా రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. భీమా రం మండలంలో విలేకర్లు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపిన అనంతరం తహసీల్దార్ భూమేశ్వర్‌కు వినతి పత్రం అందించారు. నిర్మల్ జిల్లాలోని కుంటాలలో మండలానికి చెందిన విలేకర్లు నిరసన తెలిపిన అనంతరం డిప్యూటీ తహసీల్దార్ అజీజ్ఖాన్కు వినతిపత్రాన్ని అందించారు. బాసరలో సైతం విలేకర్లు ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. కడెం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిర్మల్–మంచిర్యాల రహదారిపై బైటా యించి ఆందోళన చేపట్టారు. ఖానాపూర్‌లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. కాగజ్‌నగర్‌లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన అనంతరం తహసీల్దార్ రాంమోహన్‌కు వినతిపత్రం అందజేశారు. -
అతివేగానికి ఇద్దరు బలి
జైపూర్(చెన్నూర్): రెండు లారీల అతివేగం కారణంగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. అన్నయ్య ఇంటికని బయలుదేరిన చెల్లెలు తిరిగిరానికి లోకాలకు వెళ్లిపోయింది. మహిళను ఢీకొన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్ మరణించాడు. జైపూర్ మండలం ఇందారం–1ఏ గని క్రాస్ రోడ్డు వద్ద గల రాజీవ్ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందారం గ్రామం దొరగారిపల్లెలో నివాసం ఉంటున్న పేర్ల శ్రీమతి(55)అన్నయ్య పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. అతడి వద్దకు వెళ్లేందుకు దొరగారిపల్లె నుంచి రాజీవ్ రహదారిలో ఐకే–1ఏ క్రాస్ రోడ్డు వరకు వచ్చింది. శ్రీరాంపూర్ నుంచి అతివేగంగా గోదావరిఖని వెళ్తున్న టిప్పర్ శ్రీమతిని బలంగా ఢీకొట్టింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో తల పగిలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. టిప్పర్ వెనుకాల మరింత వేగంగా మరో లారీ వచ్చింది. వెనుక నుంచి టిప్పర్‌ను బలంగా ఢీకొని అదుపు తప్పింది. అవతలి రోడ్డుపైకి దూసుకపోయింది. లారీ ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్ శ్రీనివాస్(21) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అటువైపు వెళ్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, స్థానికులు, ప్రయాణికులు కలిసి శ్రీనివాస్‌ను బయటకు తీశారు. 108లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు రెఫర్ చేయగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీమతి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరులా రోదించారు. ఆమె భర్త రమణయ్య రెండేళ్ల క్రితం చనిపోయాడు. కాగా రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సంఘటన స్థలానికి రెండో ఎస్సై గంగరాజగౌడ్, ఏఎస్సై గంగన్న, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను నియంత్రించారు. శ్రీమతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బిగుసుకుంటున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన గీత కార్మికుడు రామాగౌడ్ ఉదంతంలో బాధ్యులపై ఉచ్చు బిగుసుకుంటోంది. రాష్ట్రంలోనే చర్చనీయాంశమైన ఈ కేసును బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ విచారణ చేస్తున్నారు. బుధవారం ఆయన నెన్నెలకు వెళ్లి స్వయంగా రామాగౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడడంతోపాటు రామాగౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్ అనే వ్యక్తికి సంబంధించి కూడా వివరాలు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసిన అంశమే ఈ ఘటనలో ప్రధానమైనదిగా మారింది. సబ్ కలెక్టర్ విచారణ కూడా అట్రాసిటీ కింద ఫిర్యాదు చేసిన మహేష్ ఎస్టీనా లేక బీసీనా అనే కోణంతో పాటు ఎస్టీ ధ్రువీకరణ పత్రం జారీ చేసే విషయంలో నిబంధనలు పాటించారా లేదా అనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మహేష్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగానే, సంబంధిత ఎస్ఐ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు తీసుకోగా, విచారణాధికారిగా వ్యవహరించిన ఏసీపీ దానిని సమర్థించి, రామాగౌడ్ ఎస్టీ గౌరవానికి భంగం కలిగించినట్లుగా నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఎస్ఐ, ఏసీపీ ఎంతమేర నిజాయితీగా వ్యహరించారనే అంశాన్ని కూడా సబ్ కలెక్టర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. భూపాలపల్లి ఇన్చార్జి కలెక్టర్‌గా ఆర్వీ.కర్ణన్ మేడారం జాతరను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జాతర ప్రారంభమయ్యే 31వ తేదీ లోపే ఆయనకు నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తహసీల్దార్‌పై తొలివేటు? పల్ల మహేష్ అనే వ్యక్తి రామాగౌడ్‌పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రాథమిక విచారణలోనే తేలిపోయింది. అయితే మహేష్ ఎస్టీ కాదని, పితృస్వామ్య దేశంలో తండ్రి కులమే సంతానానికి సంక్రమిస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. గతంలో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన ఓ విద్యార్థి ఆత్మహత్య విషయంలో కూడా ఇదే వివాదం రేగింది. ఈ నేపథ్యంలో నెన్నెల తహసీల్దార్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని మహేష్‌కు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారనే అంశాన్ని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా 2017 సెప్టెంబర్ 18న జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కొలావర్ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్‌ను తహసీల్దార్ నేరుగా సర్టిఫై చేయడం గమనార్హం. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు మొదలు, ఆత్మహత్య వరకు చోటు చేసుకోవడంతో విచారణాధికారి కూడా దీనిపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. రాజకీయంగా బెల్లంపల్లిలో హైటెన్షన్ రామాగౌడ్ ఆత్మహత్య ఉదంతం బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా టెన్షన్ వాతావరణానికి కారణమైంది. ఈ ఆత్మహత్యకు అధికార పార్టీ నాయకులే కారణమనే విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించాయి. నెన్నెల గ్రామ సర్పంచ్, మండల కో అప్షన్ సభ్యుడు, ఎంపీటీసీతో పాటు ఎమ్మెల్యేను కూడా ఇందులోకి లాగాయి. అఖిలపక్షం పేరుతో అన్ని పార్టీలు ఆందోళనలు జరుపుతుండడంతో స్వయంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీడియా సమావేశం పెట్టి తనకే సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రామాగౌడ్ తన కుటుంబంలో సభ్యుడి వంటి వాడని ఆయన చెప్పినప్పటికీ, రామాగౌడ్ మృతి తరువాత ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకులెవరూ బాధితుని కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ప్రతిపక్షాలు అవకాశంగా మార్చుకున్నాయి. ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నేతలకు ఈ అంశంతో సంబంధం లేకపోయినా... వారి ప్రోద్బలంతోనే ఎస్టీ ధ్రువీకరణ పత్రం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు వంటివి జరిగాయనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు జనంలోకి తీసుకెళ్లడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ నివేదికపైనే కేసు ఆధారపడి ఉంది. ఎస్ఐ, ఏసీపీల విచారణ ఏమైంది..? ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని రూఢి చేసుకున్న తరువాతే కేసు నమోదు చేయాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈ కేసులో పాటించలేదని సబ్ కలెక్టర్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. ఎస్ఐ కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్‌పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడం కూడా కీలకంగా మారింది. కేసు నమోదు చేసిన తరువాత గౌడ కుల సంఘాలు, రామాగౌడ్ కుటుంబసభ్యులు ఏసీపీ, కలెక్టర్లను కలిసి వాస్తవాలు తెలియజేసినా, ఎందుకు స్పందించి అట్రాసిటీ కేసు నుంచి సాధారణ కేసుగా మార్చలేదనేది ప్రశ్న. ఈ విషయాలపై విచారణ జరుపుతున్న సబ్ కలెక్టర్ ఇచ్చే నివేదిక పైనే బాధ్యులపై తీసుకునే చర్యలు ఏంటనేది తేలనుంది. -
ఎమ్మెల్యే ప్రసంగిస్తున్న వేదికపై అగ్నిప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అత్యుత్సాహానికి వెళ్లిన కొందరు కార్యకర్తలు టపాసులు పేలుస్తుండగా.. ప్రమాదవశాత్తు టపాసులు ఎగిరిపడి సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్‌కు మంటలంటుకున్నాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో.. వేదికపై ఉన్న నాయకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.