తాడేపల్లి రూరల్: మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలోని ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లు కూల్చి వేస్తోందంటూ జనసేన, తెలుగుదేశం నాయకులు వారం రోజులుగా నానా హడావుడి చేశారు. వాస్తవానికి రోడ్డును ఆక్రమించిన వారి ఇళ్లను ప్రభుత్వం ఎక్కడా కూల్చలేదు. కేవలం ప్రహరీ, మెట్లను మాత్రమే తొలగించారు.
దీనిని రాజకీయంగా వాడుకుని, లబ్ధి పొందాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల అక్కడ పర్యటించి హంగామా చేశారు. జనసేన సభకు భూములిచ్చిన వారి ఇళ్లను కూల్చి వేశారంటూ విష ప్రచారం చేశారు. ఆ తర్వాత ఒక్కో ఇంటికి రూ.లక్ష చొప్పున సాయం చేస్తానని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పటం వాసులకు విసుగు తెప్పించింది. ‘ప్రభుత్వం మా ఇళ్లను కూల్చ లేదు. మీ సానుభూతి మాకు అవసరం లేదు. డబ్బులు ఇచ్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయొద్దు’ అంటూ బుధవారం ఆయా ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: (‘ఈనాడు’కు ఎందుకంత కడుపుమంట?.. రామోజీకి కళ్లు కనపడట్లేదా?’)
Comments
Please login to add a commentAdd a comment