
జయదేవ్ సినిమా పోస్టర్ల చించివేత
నర్సీపట్నం(విశాఖపట్నం జిల్లా): ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లను గుర్తుతెలియని దుండగులు చించివేశారు.
ఈ సంఘటన నర్సీపట్నంలోని రాజుథియేటర్‌లో చోటుచేసుకుంది. రాజకీయ నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుండా పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు.