చెన్నై : తమిళ స్టార్ విజయ్‌ను ఇటీవలె టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిసిన సంగతి తెలిసిందే. ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్‌లో భాగంగా చెన్నై వెళ్లిన ధోనీ ..అదే లొకేషన్‌లో ఉన్న విజయ్‌ను కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేములో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ అనందంతో కొందరు ఫ్యాన్స్ సృష్టించిన పోస్టర్లు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. భవిష్యత్తులోఎంఎస్ ధోనీని ప్రధానమంత్రిగానూ, విజయ్‌ను ముఖ్యమంత్రిగానూ చూడోబోతున్నాం అంటూ కొందరు అభిమానులు మధురైలో పోస్టర్లు అంటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లపై దుమారం రేగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment