![Is Thalapathy Vijay Going To Roped Under Dhoni Productions - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/13/dhoni.jpg.webp?itok=uE_3f0J0)
తమిళ సినిమా: మహేంద్రసింగ్ ధోని ఎవరని పిల్లాడిని అడిగినా ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడని ఠక్కున చెప్పేస్తాడు. భారత క్రికెట్ క్రీడారంగంలో కెప్టెన్‌గా అంతటి విశేష గుర్తింపును ఆయన సంపాదించుకున్నారు. ఈయన క్రికెట్ క్రీడాకారుడిగా కొనసాగుతునే అనేక వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలా ధోని అంటే ఒక బ్రాండ్‌గా మారిపోయారు. ఈయన బయోగ్రఫీతో వచ్చిన ధోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అలాంటిది తాజాగా మహేంద్రసింగ్ ధోని కొత్త అవతారం ఎత్తడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇక్కడ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించడానికి ధోని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను కెప్టెన్ హౌస్ అనే బ్యానర్‌ను ఏర్పాటు చేసి తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో చిత్రాలు నిర్మించడానికి సిద్ధమైనట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అదేవిధంగా నటుడు విజయ్ హీరోగా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారీసు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తదుపరి అట్లీ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఈయన 70వ చిత్రాన్ని ధోని నిర్మించబోతున్నట్లు టాక్. ధోనికి సెవెన్ లక్కీ నంబర్ అట. విజయ్ 70వ చిత్రాన్ని నిర్మించడానికి ఇది కూడా ఒక కారణం అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేవిధంగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, కన్నడ స్టార్ హీరో సుదీప్‌తో కూడా చిత్రాలు చేయడానికి ధోని సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీని గురించి ఇప్పటి వరకు అధికార ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment