Jayadev
-
టాలీవుడ్లో విషాదం.. గుండెపోటుతో దర్శకుడు మృతి
ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. పలు షార్ట్ ఫిలింస్‌కి దర్శకత్వం వహించిన జయదేవ్ ‘కోరంగి నుంచి’ (2022) అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) నిర్మించింది. మంచి చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్ఎఫ్డీసీ ప్రతి ఏడాది కొన్ని చిత్రాలకు ఫండింగ్ ఇస్తుంది. అందులో భాగంగా ‘కోరంగి నుంచి’కి కోటి రూపాయల ఫండింగ్ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత నటి అర్చన ఈ సినిమాలో నటించటం విశేషం. ఈ చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ప్రముఖ దర్శకుడు, జర్నలిస్టు కేఎన్టీ శాస్త్రికి జయదేవ్ చిన్న కుమారుడు. గతంలో ఎన్ఎఫ్డీసీ నిర్మించిన ‘తిలదానం’ చిత్రదర్శకుడు కేఎన్టీ శాస్త్రి అనే సంగతి తెలిసిందే. జయదేవ్‌కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
చిత్తూరులో రూ.250 కోట్లతో.. అమరరాజా కొత్త ప్లాంట్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. (చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ) -
యాక్షన్ థ్రిల్లర్‌గా ‘నరేంద్ర’
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను డైరెక్ట్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ. కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న జయంత్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరగా గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయదేవ్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు జయంత్. మరోసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నిలేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు జయంత్. ‘నరేంద్ర’ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. -
మనసుల్ని కదిలించే సినిమా!
‘‘నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ పోలీసాఫీసర్ కథే ‘జయదేవ్’. సినిమా చూసిన ప్రేక్షకులు ‘మనసుల్ని కదిలించే సినిమా తీశారు’ అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత కె. అశోక్‌కుమార్. గంటా రవి హీరోగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘జయదేవ్’ శుక్రవారం విడుదలైంది. అశోక్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘మౌత్ టాక్ బలంగా ఉండడంతో షో షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. విధి నిర్వహణలో పోలీసులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాల పరిస్థితి ఏంటి? అనే అంశాలతో పాటు పోలీస్ త్యాగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిన్మాకు మంచి స్పందన లభిస్తోంది. డ్రగ్స్ కారణంగా యువతకు ఎంత చేటు జరుగుతోంది? ఈ సమస్యను మానవత్వ కోణంలో జయదేవ్ ఎలా పరిష్కరించాడు? అనేది ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. త్వరలో పోలీసులకు స్పెషల్ షో వేయనున్నాం’’ అన్నారు. ‘‘కథలో మంచి మెసేజ్, ఎమోషన్ ఉండటంవల్లే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు గంటా రవి. -
జయదేవ్ సినిమా పోస్టర్ల చించివేత
-
జయదేవ్ సినిమా పోస్టర్ల చించివేత
నర్సీపట్నం(విశాఖపట్నం జిల్లా): ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లను గుర్తుతెలియని దుండగులు చించివేశారు. ఈ సంఘటన నర్సీపట్నంలోని రాజుథియేటర్లో చోటుచేసుకుంది. రాజకీయ నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుండా పోలీసులు థియేటర్ వద్దకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జయదేవ్ కోసం డీజే
-
‘జయదేవ్’ పాటల విడుదల
-
చిత్ర పరిశ్రమకు దూరంగా వెళ్లే ప్రసక్తే లేదు – చిరంజీవి
‘‘ఎవరైనా సినిమాల్లోకి లవర్‌బాయ్‌గా రావాలనుకుంటారు. రవి అలా కాకుండా స్టార్టింగ్‌లోనే తన పర్సనాలిటీ, లుక్స్‌కి తగ్గట్టు టఫ్ పోలీసాఫీసర్ క్యారెక్టర్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. ఎవరేంటనేది వాళ్లు వేసిన తొలి అడుగును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ అడుగును రవి చక్కగా వేశాడని నమ్ముతున్నా. అతని భవిష్యత్తుకి ఇది మంచి ప్రారంభం అవుతుంది’’ అన్నారు నటుడు చిరంజీవి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవిని హీరోగా పరిచయం చేస్తూ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్‌కుమార్ నిర్మించిన సినిమా ‘జయదేవ్’. మణిశర్మ స్వరకర్త. మంగళవారం జరిగిన కార్యక్రమంలో నటుడు మోహన్‌బాబు పాటల సీడీలను విడుదల చేసి, తొలి సీడీని దర్శకుడు కె. రాఘవేంద్రరావుకి అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గంటా శ్రీనివాసరావుతో రాజకీయాలకు అతీతమైన స్నేహం నాది. వాళ్లబ్బాయి కంటే ఆయనకే సినిమాలపై మక్కువ ఎక్కువ. అప్పట్లో తనకున్న పరిస్థితుల వల్ల రిస్క్ తీసుకుని సినిమాల్లోకి రాలేదేమో! తనకు తీరని కోరిక కొడుకు ద్వారా తీర్చుకుంటున్న ఆనందం ఆయనలో కనపడుతోంది. యాక్షన్, ఫ్యాక్షన్, రొమాంటిక్, కామెడీ.. అన్నిటినీ బాగా తెరకెక్కించగల సమర్థుడు జయంత్. అతని దర్శకత్వంలో నటించడం రవి అదృష్టం. ‘సినిమా రంగానికి దూరంగా ఉంటూ నా పనేదో నేను చేసుకుంటుంటే... మళ్లీ తీసుకొచ్చారు’ అన్నారు నిర్మాత అశోక్‌కుమార్. సినిమా ఇండస్ట్రీని వదిలేద్దామన్నా... అది మనల్ని వదలదు అశోక్. దీనికి దూరంగా వెళ్లే ప్రసక్తే లేదు. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. ఈ సినిమా సక్సెస్‌తో నిర్మాతగా మీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘స్వర్గం–నరకం’ టైమ్‌లో నేను గంటా రవిలా లేను. అతను చాలా అందంగా ఉన్నాడు. హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘చిరంజీవి, మోహన్‌బాబుల అభిమాని అయిన రవి ‘నేను కూడా వాళ్లలా హీరో అవుతాను’ అని సినిమాల్లోకి వచ్చాడు. యాక్షన్ సినిమాలతో హీరోలుగా పరిచయమైనోళ్లు బాగా సక్సెస్ అయ్యారు. రవి కూడా సక్సెస్ అవుతాడు’’ అన్నారు టీయస్సార్. ‘‘గంటా రవి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ‘‘నా దేవుళ్లైన అమ్మానాన్నలు, ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులందరికీ థ్యాంక్స్’’ అన్నారు గంటా రవి. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, చిత్ర బృందం పాల్గొన్నారు. -
ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు
‘ఇండస్ట్రీలో ఇప్పుడు కాంబినేషన్‌కి తప్ప కథకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నాకు కథ ముఖ్యం. అది ఉంటే ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. ‘ఈశ్వర్’తో ప్రభాస్‌ని హీరోగా చేశాం. తను ఇప్పుడు పెద్ద రేంజ్ హీరో అయినందుకు గర్వంగా ఉంది. గంటా రవి కూడా ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు’’ అని జయంత్ సి. పరాన్జీ అన్నారు. గంటా రవి, మాళవికా రాజ్ జంటగా కె.అశోక్‌కుమార్ తెరకెక్కించిన ‘జయదేవ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జయంత్ సి. పరాన్జీ చెప్పిన విశేషాలు..కెమెరామేన్ జవహార్‌రెడ్డి గంటా రవిని పరిచయం చేశాడు.రవిని చూడగానే ఇతనితో సినిమా తీయొచ్చు అనిపించింది. కృషి, పట్టుదల, దీక్షతో ఈ చిత్రంలో ప్యాషన్‌తో నటించాడు. తమిళ ‘సేతుపతి’ చిత్రంలోని మెయిన్ ఎస్సెన్స్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ‘జయదేవ్’ తీశా. పరుచూరి బ్రదర్స్ కథని బాగా డెవలప్ చేశారు. ∙సిన్సియర్ పోలీసాఫీసర్ కథ ఇది. రెగ్యులర్ పోలీస్ చిత్రాల్లా ఉండదు. రవి, మాళవికలకు లాంగ్ రన్ ఉంటుంది. ఇందులో వినోద్‌కుమార్ విలన్‌గా చేశారు. నా ‘అల్లరి పిడుగు, తీన్మార్’ చిత్రాలు సరిగ్గా ఆడలేదు. గ్యాప్ తీసుకుని రైట్ టైమ్‌లో చేసిన చిత్రం ‘జయదేవ్’. మళ్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమవుతుంది. మణిశర్మ మంచి పాటలిచ్చారు. ‘ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్’ తర్వాత అశోక్కుమార్గారితో చేసిన ‘జయదేవ్’ మా కాంబినేషన్లో హ్యాట్రిక్ సాధిస్తుంది. -
కొంచెం గ్యాప్ తర్వాత!
ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదే రా వంటి హిట్ చిత్రాలు తీసిన జయంత్ సి. పరాన్జీ కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జయదేవ్’. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. అశోక్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ – ‘‘80 శాతం షూటింగ్ పూర్తయింది. ఒక ఐటమ్ సాంగ్‌ని హైదరాబాద్‌లో, మిగిలిన ఒకటిన్నర పాటను ఈ నెల 22 నుంచి 29 వరకు స్విట్జర్లాండ్‌లో చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే పోలీసాఫీసర్ల స్ఫూర్తితో జయదేవ్ పాత్ర రూపొందించాం. పది యాక్షన్ సీన్స్ కథలో లింక్ అయి ఉంటాయి’’ అన్నారు జయంత్ సి.పరాన్జీ. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ. -
ఇద్దరిలో ఒక్కరే
సాక్షి, గుంటూరు :చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు అమరరాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్ గల్లా జయదేవ్ శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతోపాటు రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కూడా ‘దేశం’ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్, తెనాలి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ఆయన మామ ఘట్టమనేని ఆదిశేషగిరిరావుఎన్నికల బరిలో ఉంటారని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఆదిశేషగిరిరావుకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, గల్లా జయదేవ్‌కు గుంటూ రు పార్లమెంట్ నియోజకవర్గం కేటాయించే విధంగా చంద్రబాబుతో మొదట్లోనే ఒప్పం దం జరిగినట్టు పార్టీ వర్గాల కథనం. అందుకు అనుగుణంగానే ఇరువురు రెండు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. గల్లా జయదేవ్ ఒక అడుగు ముందుకేసి అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆదిశేషగిరిరావు కూడా తెనాలి నియోజకవర్గానికి చెందిన ముఖ్యులతో టచ్‌లో ఉంటూ వచ్చారు. ఇదిలావుంటే, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తన నియోజకవర్గమైన తెనాలి సీటును తనకే కేటాయించాలని, అలా కాని పక్షంలో పరిస్థితులు మరో విధంగా ఉంటాయని పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో అధినేత ఇంత వరకు ఈ సీటుపై నిర్ణయం తీసుకోలేదు. మామ, అల్లుడు ఒకేసారి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ తెనాలిపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో గల్లా జయదేవ్ మాత్రమే పార్టీలో చేరారు. ఆయన మామ ఘట్టమనేని చేరిక నిలిచిపోయింది. ఇక తెనా లి సీటు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు దక్కే అవకాశా లు ఉన్నాయని ఆ వర్గం చెబుతోంది. గల్లా జయదేవ్, దేవినేని మల్లికార్జునరావులు పార్టీలో చేరిక కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.