కొంచెం గ్యాప్‌ తర్వాత! | Ganta Ravi's debut film is titled Jayadev | Sakshi
Sakshi News home page

కొంచెం గ్యాప్‌ తర్వాత!

Published Wed, Apr 5 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

కొంచెం గ్యాప్‌ తర్వాత!

కొంచెం గ్యాప్‌ తర్వాత!

ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదే రా వంటి హిట్‌ చిత్రాలు తీసిన జయంత్‌ సి. పరాన్జీ కొంత గ్యాప్‌ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జయదేవ్‌’. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె. అశోక్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక కథానాయిక.

నిర్మాత మాట్లాడుతూ – ‘‘80 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఒక ఐటమ్‌ సాంగ్‌ని హైదరాబాద్‌లో, మిగిలిన ఒకటిన్నర పాటను ఈ నెల 22 నుంచి 29 వరకు స్విట్జర్లాండ్‌లో చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్‌ పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే  పోలీసాఫీసర్ల స్ఫూర్తితో జయదేవ్‌ పాత్ర రూపొందించాం. పది యాక్షన్‌ సీన్స్‌ కథలో లింక్‌ అయి ఉంటాయి’’ అన్నారు జయంత్‌ సి.పరాన్జీ. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement