మనసుల్ని కదిలించే సినిమా! | Jayadev is the story of a policeman who is the proof of honesty. | Sakshi
Sakshi News home page

మనసుల్ని కదిలించే సినిమా!

Published Sat, Jul 1 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

మనసుల్ని కదిలించే సినిమా!

మనసుల్ని కదిలించే సినిమా!

‘‘నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ పోలీసాఫీసర్‌ కథే ‘జయదేవ్‌’. సినిమా చూసిన ప్రేక్షకులు ‘మనసుల్ని కదిలించే సినిమా తీశారు’ అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత కె. అశోక్‌కుమార్‌. గంటా రవి హీరోగా జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘జయదేవ్‌’ శుక్రవారం విడుదలైంది. అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ – ‘‘మౌత్‌ టాక్‌ బలంగా ఉండడంతో షో షోకి కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి.

విధి నిర్వహణలో పోలీసులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాల పరిస్థితి ఏంటి? అనే అంశాలతో పాటు పోలీస్‌ త్యాగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిన్మాకు మంచి స్పందన లభిస్తోంది. డ్రగ్స్‌ కారణంగా యువతకు ఎంత చేటు జరుగుతోంది? ఈ సమస్యను మానవత్వ కోణంలో జయదేవ్‌ ఎలా పరిష్కరించాడు? అనేది ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. త్వరలో పోలీసులకు స్పెషల్‌ షో వేయనున్నాం’’ అన్నారు. ‘‘కథలో మంచి మెసేజ్, ఎమోషన్‌ ఉండటంవల్లే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు గంటా రవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement