Ganta Ravi
-
మనసుల్ని కదిలించే సినిమా!
‘‘నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ పోలీసాఫీసర్ కథే ‘జయదేవ్’. సినిమా చూసిన ప్రేక్షకులు ‘మనసుల్ని కదిలించే సినిమా తీశారు’ అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత కె. అశోక్‌కుమార్. గంటా రవి హీరోగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘జయదేవ్’ శుక్రవారం విడుదలైంది. అశోక్‌కుమార్ మాట్లాడుతూ – ‘‘మౌత్ టాక్ బలంగా ఉండడంతో షో షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. విధి నిర్వహణలో పోలీసులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాల పరిస్థితి ఏంటి? అనే అంశాలతో పాటు పోలీస్ త్యాగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిన్మాకు మంచి స్పందన లభిస్తోంది. డ్రగ్స్ కారణంగా యువతకు ఎంత చేటు జరుగుతోంది? ఈ సమస్యను మానవత్వ కోణంలో జయదేవ్ ఎలా పరిష్కరించాడు? అనేది ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. త్వరలో పోలీసులకు స్పెషల్ షో వేయనున్నాం’’ అన్నారు. ‘‘కథలో మంచి మెసేజ్, ఎమోషన్ ఉండటంవల్లే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు గంటా రవి. -
చిత్ర పరిశ్రమకు దూరంగా వెళ్లే ప్రసక్తే లేదు – చిరంజీవి
‘‘ఎవరైనా సినిమాల్లోకి లవర్‌బాయ్‌గా రావాలనుకుంటారు. రవి అలా కాకుండా స్టార్టింగ్‌లోనే తన పర్సనాలిటీ, లుక్స్‌కి తగ్గట్టు టఫ్ పోలీసాఫీసర్ క్యారెక్టర్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. ఎవరేంటనేది వాళ్లు వేసిన తొలి అడుగును బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ అడుగును రవి చక్కగా వేశాడని నమ్ముతున్నా. అతని భవిష్యత్తుకి ఇది మంచి ప్రారంభం అవుతుంది’’ అన్నారు నటుడు చిరంజీవి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవిని హీరోగా పరిచయం చేస్తూ జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్‌కుమార్ నిర్మించిన సినిమా ‘జయదేవ్’. మణిశర్మ స్వరకర్త. మంగళవారం జరిగిన కార్యక్రమంలో నటుడు మోహన్‌బాబు పాటల సీడీలను విడుదల చేసి, తొలి సీడీని దర్శకుడు కె. రాఘవేంద్రరావుకి అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గంటా శ్రీనివాసరావుతో రాజకీయాలకు అతీతమైన స్నేహం నాది. వాళ్లబ్బాయి కంటే ఆయనకే సినిమాలపై మక్కువ ఎక్కువ. అప్పట్లో తనకున్న పరిస్థితుల వల్ల రిస్క్ తీసుకుని సినిమాల్లోకి రాలేదేమో! తనకు తీరని కోరిక కొడుకు ద్వారా తీర్చుకుంటున్న ఆనందం ఆయనలో కనపడుతోంది. యాక్షన్, ఫ్యాక్షన్, రొమాంటిక్, కామెడీ.. అన్నిటినీ బాగా తెరకెక్కించగల సమర్థుడు జయంత్. అతని దర్శకత్వంలో నటించడం రవి అదృష్టం. ‘సినిమా రంగానికి దూరంగా ఉంటూ నా పనేదో నేను చేసుకుంటుంటే... మళ్లీ తీసుకొచ్చారు’ అన్నారు నిర్మాత అశోక్‌కుమార్. సినిమా ఇండస్ట్రీని వదిలేద్దామన్నా... అది మనల్ని వదలదు అశోక్. దీనికి దూరంగా వెళ్లే ప్రసక్తే లేదు. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. ఈ సినిమా సక్సెస్‌తో నిర్మాతగా మీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది’’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ – ‘‘స్వర్గం–నరకం’ టైమ్‌లో నేను గంటా రవిలా లేను. అతను చాలా అందంగా ఉన్నాడు. హీరోగా సక్సెస్ అవుతాడు’’ అన్నారు. ‘‘చిరంజీవి, మోహన్‌బాబుల అభిమాని అయిన రవి ‘నేను కూడా వాళ్లలా హీరో అవుతాను’ అని సినిమాల్లోకి వచ్చాడు. యాక్షన్ సినిమాలతో హీరోలుగా పరిచయమైనోళ్లు బాగా సక్సెస్ అయ్యారు. రవి కూడా సక్సెస్ అవుతాడు’’ అన్నారు టీయస్సార్. ‘‘గంటా రవి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు’’ అన్నారు కె. రాఘవేంద్రరావు. ‘‘నా దేవుళ్లైన అమ్మానాన్నలు, ఇక్కడికి వచ్చిన సినీ ప్రముఖులందరికీ థ్యాంక్స్’’ అన్నారు గంటా రవి. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, చిత్ర బృందం పాల్గొన్నారు. -
ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు
‘ఇండస్ట్రీలో ఇప్పుడు కాంబినేషన్‌కి తప్ప కథకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నాకు కథ ముఖ్యం. అది ఉంటే ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. ‘ఈశ్వర్’తో ప్రభాస్‌ని హీరోగా చేశాం. తను ఇప్పుడు పెద్ద రేంజ్ హీరో అయినందుకు గర్వంగా ఉంది. గంటా రవి కూడా ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు’’ అని జయంత్ సి. పరాన్జీ అన్నారు. గంటా రవి, మాళవికా రాజ్ జంటగా కె.అశోక్‌కుమార్ తెరకెక్కించిన ‘జయదేవ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జయంత్ సి. పరాన్జీ చెప్పిన విశేషాలు..కెమెరామేన్ జవహార్‌రెడ్డి గంటా రవిని పరిచయం చేశాడు.రవిని చూడగానే ఇతనితో సినిమా తీయొచ్చు అనిపించింది. కృషి, పట్టుదల, దీక్షతో ఈ చిత్రంలో ప్యాషన్‌తో నటించాడు. తమిళ ‘సేతుపతి’ చిత్రంలోని మెయిన్ ఎస్సెన్స్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ‘జయదేవ్’ తీశా. పరుచూరి బ్రదర్స్ కథని బాగా డెవలప్ చేశారు. ∙సిన్సియర్ పోలీసాఫీసర్ కథ ఇది. రెగ్యులర్ పోలీస్ చిత్రాల్లా ఉండదు. రవి, మాళవికలకు లాంగ్ రన్ ఉంటుంది. ఇందులో వినోద్‌కుమార్ విలన్‌గా చేశారు. నా ‘అల్లరి పిడుగు, తీన్మార్’ చిత్రాలు సరిగ్గా ఆడలేదు. గ్యాప్ తీసుకుని రైట్ టైమ్‌లో చేసిన చిత్రం ‘జయదేవ్’. మళ్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమవుతుంది. మణిశర్మ మంచి పాటలిచ్చారు. ‘ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్’ తర్వాత అశోక్కుమార్గారితో చేసిన ‘జయదేవ్’ మా కాంబినేషన్లో హ్యాట్రిక్ సాధిస్తుంది. -
కొంచెం గ్యాప్ తర్వాత!
ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదే రా వంటి హిట్ చిత్రాలు తీసిన జయంత్ సి. పరాన్జీ కొంత గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ‘జయదేవ్’. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కె. అశోక్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక కథానాయిక. నిర్మాత మాట్లాడుతూ – ‘‘80 శాతం షూటింగ్ పూర్తయింది. ఒక ఐటమ్ సాంగ్‌ని హైదరాబాద్‌లో, మిగిలిన ఒకటిన్నర పాటను ఈ నెల 22 నుంచి 29 వరకు స్విట్జర్లాండ్‌లో చిత్రీకరిస్తాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘కర్తవ్య నిర్వహణ కోసం కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే పోలీసాఫీసర్ల స్ఫూర్తితో జయదేవ్ పాత్ర రూపొందించాం. పది యాక్షన్ సీన్స్ కథలో లింక్ అయి ఉంటాయి’’ అన్నారు జయంత్ సి.పరాన్జీ. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.