ప్రధానిని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు | Delhi Police arrests 9 over posters against PM | Sakshi
Sakshi News home page

ప్రధానిని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు

Published Sun, May 16 2021 6:24 AM | Last Updated on Sun, May 16 2021 6:24 AM

Delhi Police arrests 9 over posters against PM - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ వైఖరిని విమర్శిస్తూ పోస్టర్లు వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 25 మందిని అరెస్ట్‌ చేయడంతోపాటు 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో కనిపించిన ఆ పోస్టర్లపై ‘మోదీజీ..మా పిల్లల వ్యాక్సిన్‌ను విదేశాలకు ఎందుకు పంపించారు?’ అని ఉందని పోలీసులు తెలిపారు. సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు స్పందిస్తూ..‘ ప్రస్తుతానికి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎవరి ప్రోద్బలం మేరకు ఈ పోస్టర్లను అంటించారనే దానిపై విచారణ చేపట్టాం. బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. ఈ పోస్టర్లను అంటించినందుకు తనకు రూ.500 ఇచ్చారని నార్త్‌ ఢిల్లీలో అరెస్టయిన వ్యక్తి పోలీసు విచారణలో వెల్లడించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement