
అమీర్‌పేట: అమీర్‌పేట మైత్రివనమ్ కూడలిలో డిగ్రీ కాలేజ్ సినిమాకు చెందిన అశ్లీల పోస్టర్లు అతికించినందుకు సినిమా దర్శకుడు,నిర్మాతలపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెపెక్టర్ మురళీకృష్ణ తెలిపిన మేరకు.. డిగ్రీ కాలేజ్ సినిమాకు సంబంధించిన అశ్లీలంగా ఉన్న పోస్టర్లను మైత్రివనమ్ పరసర ప్రాంతాల్లో అతికించారు. వీటిని చూసి విస్తుపోయిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. టాస్క్‌ఫోర్సు పోలీసులు నినిమా దర్శకుడు నర్సింహ నంది, నిర్మాత శ్రీనివాస్‌రావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.ఈ కేసును సుమోటోగా నమోదు చేసుకున్న ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.కాగా నింధితుల్లో ఒకరైన దర్శకుడు నర్సింహ నంది జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకులుగా అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment