చర్ల(ఖమ్మం): మరోసారి మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ప్రధాన రహదారిపై ఆదివారం మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు వెంకటాపురం కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్లను అంటించారు. భద్రాచలం ఆలయ భూములను పేదలకు పంచాలని మావోయిస్టులు పోస్టర్‌లో పేర్కొన్నారు. అలాగే పోలవరం, కంతనపల్లి ప్రాజెక్టుల నిర్మాణం ఆపివేయాలన్నారు. అపరేషన్ గ్రీన్‌హంట్‌ను ప్రజాయుద్దం ద్వారా తిప్పి కొడతామన్నారు.
చర్లలో మావో పోస్టర్ల కలకలం
Published Sun, Sep 6 2015 2:33 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement