charla
-
ఆర్కే తండ్రి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు
చర్ల: ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి మిత్రులు. గుంటూరు ఏసీ కళాశాలలో చదివే రోజుల్లో వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. 1983లో ఎన్టీ.రామా రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో సచ్చిదానందరావును స్వయంగా పిలిచారట. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సచ్చిదానందరావు కుటుంబ వివరాలను తెలుసుకున్న ఎన్టీరామారావు ఆయన కుమారుడు ఆర్కేకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పగా అందుకు నిరాకరించిన ఆర్కే తాను ప్రజల కోసం పీపుల్స్‌వార్‌లో పని చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపో యారట. అంతకు ముందు నుంచే ఆర్కే పీపుల్స్‌వార్ దళంలో పని చేస్తున్నప్పటికీ ఆయన చెప్పే వరకు తల్లిదండ్రులకు తెలియ దు. తర్వాత కొన్ని రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయి హరగోపాల్ నుంచి రామకృష్ణగా, ఆర్కేగా పేరు మార్చుకున్నాడు. అనంతరం పీపుల్స్‌వార్‌లో ఉన్నత స్థాయికి చేరాడు. తప్పుడు పనులు చేసే వాళ్లకు శిక్షలు 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్కే పీపుల్స్‌వార్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులు, వడ్డీ వ్యాపారుల అరాచకాలను ఎదిరించాడు. ఈ క్రమంలో ఆర్కే కొందరిని హతమార్చాడు. దీంతో తప్పుడు పనులు చేయడానికి అప్పుడు జనం భయపడ్డారు. అప్పట్లో మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి నేరుగా శిక్షలు కూడా విధించారు. దీంతో జనం పీపుల్స్ వార్‌పై ఆసక్తి చూపారు. ఈ క్రమంలో చాలా మంది ప్రజలు వారి బాధలను నేరుగా పీపుల్స్‌వార్ సభ్యులకే చెప్పుకునేవారు. ఉద్యమం ఆ స్థాయికి చేరుకునేలా చేయడంలో ఆర్కే విజయం సాధించాడు. ఆ తర్వాత కాలంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీలో విలీనం కావడంతో ఆర్కే జాతీయ నాయకుడ య్యాడు. ఉద్యమంలో ఉండగానే విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావుకు దగ్గరి బంధువునే ఆర్కే వివాహం చేసుకున్నాడు. -
తుపాకుల మోత.. అట్టుడికిన అడవి
చర్ల : మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు ఈసారి ఏజెన్సీ ఆదివాసీల్లో వణుకు పుట్టించాయి. తుపాకుల మోతలు ఓవైపు, బాంబు పేలుళ్ల శబ్దాలు మరోవైపు భయాందోళనలు కలిగించాయి. ఇక సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలైతే ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే తీవ్రంగా భయపడ్డారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతం కావడం, మరో వైపు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ సభ్యులు మృత్యువాత పడడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోయారు. ఈనెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చర్ల–శబరి ఏరియా కమిటీ, భదాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి జిల్లా కమిటీలు, తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాయి. అయితే వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వరుస ఘటనలతో బెంబేలు.. చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో ఈనెల 23న రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అంతకు ముందు 19న చర్ల మండలం తేగడ – కలివేరు గ్రామాల మధ్య రాష్ట్రీయ రహదారి పక్కన మావో యిస్టులు ఏర్పాటు చేసిన 3 శక్తివంతమైన మందుపాతర్లను గుర్తించిన పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈనెల 6న పెదమిడిసిలేరు–తిప్పాపురం మార్గంలో గల ప్రధాన రహదారి పై మావోయిస్టులు మందుపాతరలు పేల్చారు. ఆ తెల్లవారి వద్దిపేట – పూసుగుప్ప అడవుల్లో ఎదురుకాల్పులు జరగగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఇక ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల వివిధ గ్రామాలకు చెందిన పలువురు ఆదివాసీలను ఇన్ఫార్మర్లుగా భావిస్తూ మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ప్రజాకోర్టులు నిర్వహించి వారం రోజుల వ్యవధిలో 16 మందిని హతమార్చారు. ఇలా ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల చర్యలతో ఆదివాసీ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాల నిర్వహణలో గతం కంటే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఆదివాసీ గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ సామాన్య ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా భయాందోళన చెందారు. -
సరిహద్దుల్లో భయం భయం
చర్ల: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోనూ పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. అయితే పోలీసులకు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారని, తమ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను మావోయిస్టులు కిడ్నాప్ చేసి, ప్రజాకోర్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురిని హతమారుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజాపూర్ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను వారం వ్యవధిలో 16 మందిని హతమార్చినట్లు సమాచారం. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన వారిలో బట్టిగూడెం, కౌరగట్ట, కోడేపాల్, బీమారంపాడు, పూసుబాక గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. కాగా ఇన్ఫార్మర్ల హత్యల విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తెలియనీయవద్దని, ఎవరైనా చెబితే వారిని కూడా శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరించినట్లు సమాచారం. ఆయా గ్రామాల నుంచి పామేడుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తారనే అనుమానంతో పామేడు – ధర్మారం మధ్యలో ఉన్న వాగులపై నడిచే పడవలను సైతం మావోయిస్టులు నిలిపివేసినట్లు తెలిసింది. అలాగే ఆదివాసీల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎంత మందిని హతమారుస్తారోనని భయపడుతున్నారు. 28న బంద్‌కు మావోయిస్టుల పిలుపు వివిధ ప్రాంతాల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్త బంద్ పాటించాలని జయశంకర్ భూపాలపల్లి – ములుగు – మహదేవపూర్ – వరంగల్ – పెద్దపల్లి డివిజన్ల సీపీఐ (మావోయిస్టు) కార్యదర్శి వెంకటేశ్ పేరిట శనివారం ఓ ప్రకటన విడుదలైంది. చెన్నాపురం, కదంబ పూసుగుప్ప, దేవార్లగూడెంలలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లను ఖండించాలని పేర్కొన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లలో శంకర్, శ్రీను, ఐతు, చుక్కాలు, బాజీరావు, జోగయ్య, రాజే, లలితను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లపై హక్కుల సంఘాలు నిజనిర్ధారణ కొనసాగించి బాధ్యులైన వాళ్లకు శిక్షలు పడేలా చూడాలని ఆయన కోరారు. -
'చర్ల ఎన్కౌంటర్..రీ పోస్టుమార్టం జరిపించండి'
సాక్షి, హైదరాబాద్ : చర్ల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది రగునాథ్ హైకోర్టును కోరారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని తెలిపారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలన్నారు. అదే విధంగా మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టు మార్టం చేపించాలని హైకోర్టును కోరారు. (ముగ్గురు మావోల ఎన్కౌంటర్ ) అయితే ఇప్పటికే మూడు మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించామని ప్రభుత్వం బదులిచ్చింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం కుటుంబ సభ్యుల నుండి మృతదేహాలను తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీజ్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంతేకాకుండా ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం చేపించాలని ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం వీడియో గ్రఫీ చేపించి రీపోర్ట్ షీల్డ్ కవర్లో సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5 కు వాయిదావేసింది. (చర్ల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి) -
చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: చర్ల ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు మృత దేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ హైకోర్టును కోరారు. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాలని తెలిపారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలన్నారు. అదే విధంగా మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టు మార్టం చేపించాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారించ చేపట్టనున్నది. చదవండి: ముగ్గురు మావోల ఎన్కౌంటర్ -
ఏజెన్సీలో ఎన్కౌంటర్.. టెన్షన్ టెన్షన్
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణలో మరోసారి మావోయిస్టుల ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా మావోల ఏరివేతపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసుశాఖ అటవీ ప్రాంతాల్లో వరుస కూంబింగులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చర్ల-చత్తీస్‌గఢ్ సరిహద్దులో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే పోలీసులు ఎన్కౌంటర్ జరపడం గమనార్హం. చర్ల మండలంలోని వడ్డిపేట, పుస్సుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. మృతుల్లో ఒకరు శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో బ్యారెల్ గన్, ఒక పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో టెన్సన్ వాతావరణం నెలకొంది. (సమీక్షలతో డీజీపీ హల్ చల్) మరోవైపు కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు అలియాస్ శంకర్‌ను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా పలు ప్రధాన రహదారుల మీద దృష్టి కేంద్రీకరించిన పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. మావోయిస్టు బంద్ దృష్ట్యా ఏజెన్సీలో ప్రత్యేక బలగాలను మోహరింపజేసి కూంబింగ్ చేపట్టారు. స్పెషల్ పార్టీ బలగాలతో పాటు ఈ దఫా గ్రేహౌండ్స్ దళాలతో సరిహద్దు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే చర్ల మండలంలో తాజా ఎన్కౌంటర్ జరిపారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్ రెడ్డి వరుస పర్యటనల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఛత్తీస్గడ్, మహారాష్ట్రల నుంచి తెలంగాణ లోకి మావోయిస్టుల కట్టడి విషయంలో పోలీసులకు డీజీపీ కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. -
టీఆర్ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్
చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్త కొత్తూరులో టీఆర్ఎస్కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... శ్రీనివారావు ఇంటికి సోమవారం రాత్రి 10 గంటల సమయంలో సుమారు 30 మంది మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు తెరిచే ఉండటంతో నేరుగా బెడ్రూంలోకి వెళ్లి నిద్రిస్తున్న శ్రీనివాసరావును లేపారు. బలవంతంగా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్‌కుమార్ అడ్డుపడ్డారు. దీంతో దుర్గకు ఒక మావోయిస్టు తుపాకీ చూపించి బెదిరించాడు. ప్రవీణ్‌ను కూడా పక్కకు నెడుతుండగా అతడికి మావోయిస్టులకు మధ్య పెనుగులాట జరిగింది. తమకు అడ్డు తగులుతున్నాడనే నెపంతో మరో మావోయిస్టు ప్రవీణ్‌కుమార్ తలపై కర్రతో బలంగా కొట్టడంతో తల పగిలింది. మరో మావోయిస్టు వచ్చి తుపాకీ చూపించి దుర్గ, ప్రవీణ్‌కుమార్‌ను అడ్డగించి శ్రీనివాసరావును బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. మావోయిస్టులు ఒక ద్విచక్రవాహనాన్ని వెంట తెచ్చుకోగా.. వెళ్లే సందర్భంలో ఇంటి బయట ఉన్న శ్రీనివాసరావు ద్విచక్ర వాహనాన్ని కూడా తీసుకెళ్లారు. మావోయిస్టులు తీసుకొచ్చిన ద్విచక్రవాహనంపై ఎక్కించే క్రమంలో నిరాకరించిన శ్రీనివాసరావును అక్కడ కూడా కర్రలతో కొట్టినట్లు తెలిసింది. అక్కడి నుంచి కిష్టారంపాడు మీదుగా దండకారణ్యానికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాసరావు ఇంటికి వచ్చిన 30 మంది మావోయిస్టుల్లో 10 మంది వద్ద తుపాకులు, మిగిలిన వారి వద్ద విల్లంబులు, కర్రలు, కత్తులు, గొడ్డళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఏజెన్సీలో మావోయిస్టుల ఘాతుకం
-
ఏజెన్సీలో మావోయిస్టుల ఘాతుకం
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని చర్ల మండలంలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు చెందిన ముగ్గురు గిరిజన యువకులను రెండు రోజులు క్రితం మావోయిస్టులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వారిలో ఇద్దరు యువకులును మావోయిస్టులు హతమార్చినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించి వివరాలిలా ఉన్నాయి. చర్ల మండలంలోని బోదనెగ్రగామానికి చెందిన కుంజా బుజ్జితో పాటు చింతగుప్ప గ్రామానికి చెందిన ఒక యువకుడితో పాటు మరో యువకుడిని మావోయిస్టులు రెండు రోజుల క్రితం అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజులు గడిచినా వారి ఆచూకీ లభించపోవడంతో ఇన్ఫార్‌నెపంతో వారిని హతమార్చినట్లు సమాచారం. మాట్లాడే పనుందంటూ వారిని తీసుకెళ్లిన మావోయిస్టులు రెండు రోజులు దాటినప్పటికీ వారిని విడిచిపెట్టకపోవడంతో వారిని కిడ్నాప్ చేసినట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన గిరిజనులకు ఎటువంటి హాని తలపెట్టకుండా వారిని మానవతాదృక్పదంతో విడిచిపెట్టాలంటూ ఆదివాసీల సంఘాల పేరిట శనివారం పత్రికలకు లేఖలు అందాయి. ఎటువంటి తప్పిదాన్ని చేయని గిరిజన యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తక్షణమే మావోయిస్టులు కిడ్నాప్ చేసిన గిరిజన యువకులను విడిచిపెట్టాలంటూ మావోయిస్టులను గిరిజన సంఘాలు కోరుతున్నాయి. -
మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తూ..
చర్ల: మావోయిస్టులకు పేలుడు సామగ్రి చేరవేస్తోన్న ఇద్దరు సానుభూతిపరులను ఖమ్మం జిల్లా చర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. చర్ల -పూసుగుప్ప మార్గంలోని లెనిన్ కాలనీ శివారులో పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో అదే మార్గంలో ఈ ఇద్దరూ వస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా వారి వద్ద పేలుడు పదార్థాలు లభించాయి. అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మావోయిస్టులకు సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. -
ఛత్తీస్ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సల్స్ మృతి
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలో ఇటీవల అతి పెద్ద ఎన్కౌంటర్ సమయంలో తప్పించుకున్న మావోలు కొందరు ఛత్తీస్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఉన్నారనే అనుమానంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో సుకుమా జిల్లాలోని చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల నడుమ గంట పాటు ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన పోలీసులు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు గుర్తించారు. ఆయుధాలు, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం దొరికాయి. మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. -
మహిళలంటే చిన్నచూపు!
చర్ల : ‘మావోయిస్టు ఉద్యమంపై మహిళల మనోవేదన’ పేరుతో చర్ల మండలం సత్యనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి కరపత్రాలు వెలిశాయి. అందులోని వివరాలిలా ఉన్నాయి.. ‘మావోయిస్టు అగ్రనాయకులారా.. మీరు అభం శుభం తెలియని, దిక్కు మొక్కూ లేని అనాథ, అమాయక ఆదివాసీ బాలికలను, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుంటూ మావోయిస్టులు పార్టీలోకి బలవంతంగా చేర్చుకుంటున్నారు.. వారి వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారు.. వారి చావులకు కారణమవుతున్నారు.. ఇదేనా మీరు చేసే ప్రజాయుద్ధం.. నేటికీ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఎంతో మంది ఆదివాసీ మహిళలు, బాలికలు సరైన వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం మీకు తెలియదా ? నరహంతక ముఠాగా మారిన మీరు పెట్టే మందు పాతరల బారిన అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లిన ఎందరో ఆదివాసీ మహిళలు పడి అర్ధంతరంగా చనిపోతున్నారు. గతంలో కుంట గ్రామంలోని హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ బాలిక మీ మందు పాతరకు బలై రెండు ముక్కలైంది. అగ్రనాయకులమనే అహంకారంతో ఎంతో మంది ఆదివాసీ మహిళలను బెదిరించి లొంగదీసుకోవడం, అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఎదురు తిరిగిన మహిళా మావోయిస్టులపై చెడు ప్రచారం చేయడం.. ఇదేనా మీరు చేసే ప్రజా ఉద్యమం.. మహిళా హక్కుల సాధనకు మీరు పోరాడిన దాఖలాలు ఉన్నాయా? పోలీసుల ఎదురుకాల్పుల్లో అమాయక ఆదివాసీ మహిళలను అడ్డుపెట్టుకొని పారిపోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా ?’ అని ఘాటుగా ప్రశ్నించింది. ‘మీరు ఉద్యమకారులు కాదు.. నరహంతకులు.. మీకు ప్రజలే బుద్ధి చెపుతారు’ అంటూ హెచ్చరించింది. ఈ కరపత్రాలపై మండలంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏ బాధిత మహిళ ఇంత ధైర్యం చేసి కరపత్రాలు ముద్రించిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది పోలీసుల పనే అయి ఉండవచ్చునే ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై వస్తున్న ఆరోణల నేపథ్యంలో చర్ల ఎస్సై రాజువర్మ, సీఐ తాళ్లపల్లి సత్యనారాయణలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. -
ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చర్ల మండలం తిప్పాపురం సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో శనివారం సుమారు గంటసేపు ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ నెల 5వ తేదీన మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోలు తారసపడడం తో ఎదురు కాల్పులు మొదలైనట్లు తెలుస్తుంది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడగా, ఓ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం. అయితే అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. కాగా మావోయిస్టుల నిర్మూలన పేరుతో పాలకులు ప్రజలపై చేస్తున్న ఫాసిస్టు నిర్బంధానికి వ్యతిరేకంగా దండకారణ్యం, తెలంగాణలో ఈనెల 5న బంద్ పాటించాలని సీపీఐ(మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు స్పెషల్ జోనల్ కమిటీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు వికల్స్, జగన్ పేరిట బుధవారం లేఖ విడుదలైన విషయం తెలిసిందే. -
కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం
కొత్తగూడెం/చర్ల: కస్తూర్బా విద్యాలయం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని లక్ష్మీకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్‌లో కూడా కూర్చున్న వీరిద్దరూ నిద్రకు ఉపక్రమించి.. తెల్లవారే సరికి కనిపించకపోవడంతో విద్యాలయ అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. మండలంలోని కొయ్యూరు, సాయినగర్కాలనీలకు చెందిన గోటి గౌరి, బండారు సౌజన్య చర్లలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసి 10.30 గంటలకు పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు విద్యార్థులను చదివించేందుకు సిబ్బంది నిద్ర లేపుతుండగా వీరిరువురూ కనిపించలేదు. ఈ విషయాన్ని సిబ్బంది విద్యాలయం ప్రత్యేకాధికారిణికి సమాచారం అందించారు. సిబ్బంది అంతటా వెదికినా ఆచూకీ తెలియకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలిపారు. విద్యాలయానికి మూడు వైపులా ప్రహరీ గోడ, గేట్లకు తాళాలు వేసి ఉండగా వెనుకవైపున ఉన్న ప్రహరీగోడ కూలిపోయింది. అక్కడి నుంచే విద్యార్థినులు వెళ్లిపోయి ఉంటారని అంతా అనుమానిస్తున్నారు. విద్యాలయంలో ముందు భాగం, హాలులో మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా విద్యార్థులు వెళ్లిన పుటేజీలు అందులో రికార్డు కాలేదు. ఎంఈఓ జుంకీలాల్, తహశీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీపీ కోందరామయ్య, జడ్పీటీసీ సభ్యురాలు తోటమళ్ల హరిత విద్యాలయాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల సూచనల మేరకు విద్యాలయం ప్రత్యేకాధికారిణి చర్ల పోలీస్టేషన్ పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంబించారు. విద్యార్థినుల అదృశ్యానికి చదువుల ఒత్తిళ్లు కారణమా... సిబ్బంది మందలించారా... లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. -
అడవి.. అర్ధరాత్రి.. హత్య..
చర్ల : ఏజెన్సీ మరోసారి ఉలిక్కిపడింది. అక్కడ అలజడి చెలరేగింది. అడవిలో అర్థరాత్రి దారుణం జరిగింది. ఎప్పుడు..? ఎక్కడ..? ఏమైంది..? వీటికి సమాధానాలు కావాలనుకుంటే ఇది చదవండి... మండల కేంద్రాలైన చర్ల, వెంకటాపురం మ ధ్యన రోడ్డు ఉంది. దానికి చుట్టూ దట్టమైన అడవి. ఆ రోడ్డు దిగి, కాలిబాటన దాదాపుగా మూ డు కిలోమీటర్ల దూరం వెళితే.. అక్కడక్కడ విసిరేసినట్టుగా చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తాయి. అదొక కుగ్రామం. దాని పేరు.. క్రాంతిపురం. చర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ పరిధిలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలు సరిహద్దు దాటి ఇక్కడ, ఈ అడవిలో ఇలా చిన్న చిన్న గుడిసెలు వేసుకుని ఇక్కడే నివసిస్తున్నారు. కూలీనాలీ పనులు చేసుకుంటున్నారు. అతడి పేరు మడివి రమేష్(30), నిరుపేద కూలీ. మంగళవారం రాత్రి ఆయన, భార్య నందిని, పిల్లలు కలిసి భోజనం చేసి పడుకున్నారు. అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఆయన ఇంటికి ఆరుగురు వచ్చారు. రమేష్‌ను లేపారు. భార్య నందిని కూడా లేచింది. వారు ఎవరో.. ఎందుకొచ్చారో ఆ దంపతులకు అంతుబట్టలేదు. బిత్తరపోయి.. భయం భయంగా చూస్తున్నారు. ఆ ఆరుగురి వద్ద మారణాయుధాలు (గొడ్డళ్లు, కత్తులు) ఉన్నాయి. వారిలో ఏ ఒక్కరూ ఒక్క మాటయినా మాట్లాడడం లేదు. రమేష్‌ను బలవంతంగా పైకి లేపారు. బయటకు తీసుకెళ్లారు. భర్త వెంటే భార్య నందిని కూడా వెళ్లింది. ఇంటి ముందు, రమేష్‌ను ఆ ఆరుగురు కలిసి ఇష్టానుసారంగా కొడుతున్నారు. ఎవరు మీరు..? ఎందుకు కొడుతున్నారు,..? అని నందిని భయంతో వణుకుతూ, గొంతు పెగుల్చుకుని అడిగింది. ఉహూం.. సమాధానం లేదు. కొడుతూనే ఉన్నారు. ఆమె అడ్డుకోబోయింది. ఆమెను కూడా కొట్టారు. ఆమె బిగ్గరగా రోదిస్తూ, నాలుగడుగుల దూ రంలోగల గుడిసెల వద్దకు వెళ్లింది. గట్టిగా అ రుస్తూ వారిని లేపింది. అందరూ వచ్చారు. కొ ద్దిసేపటి క్రితం వరకు అక్కడే ఉన్న ఆ ఆరుగురు ఆగంతకులు కనిపించలేదు. మాయమయ్యారు. ఒంటి నిండా గాయాలతో.. ఆగకుండా కారుతున్న రక్తపు ధారలతో.. రమేష్ అక్కడే పడున్నాడు.. ఒంటరిగా.. నిశ్చలంగా.. నిర్జీవంగా..! అతడి ప్రాణం పోయింది. నందిని ఘొల్లుమంది. గుండెలవిసేలా రోదించింది. ఎవరొచ్చారో తెలియదు.. ఎందు కొచ్చారో తెలియదు.. ఎందుకు కొట్టారో తెలియదు.. ప్రాణాలెందుకు తీశారో తెలియదు... ఎవరీ రమేష్..? ఇక్కడి వలస కుగ్రామానికి పెద్దగా ఈ రమేష్ వ్యవహరిస్తున్నాడు. అక్కడున్న ఆదివాసీల మధ్య ఏదేని తగాదాలు వస్తే పంచాయితీ పెట్టి, పరిష్కరిస్తుంటాడు. అక్కడి వారు కూడా అతడికి, అతడి మాటకు గౌరవమిస్తారు. సహజం గానే, వ్యతిరేకులు కూడా తయారయ్యారు. ఎవరు చంపారు..? ఎవరికీ తెలియదు. ఈ గ్రామంలోని కొంద రు ఆదివాసీలు మాత్రం.. ‘‘ఇది మావోయిస్టుల పనే’’ అని అనుమానిస్తున్నారు. ‘‘ఇన్ఫార్మర్ నెపంతో ఇతడిని మావోయిస్టులే చంపారేమో. సరిగ్గా రెండు నెలల క్రితం (నవంబర్ 25వ తేదీ రాత్రి) ఇదే మండలం(చర్ల)లోని పెద్దమిడిసిలేరు గ్రామానికి చెందిన సోడి ప్రసాద్(50)ను ఇన్ఫార్మర్ పేరుతో అన్నలు (మావోయిస్టులు) చంపేశారు. రమేష్‌ను కూడా వాళ్లే చంపారేమో..’’ అంటున్నారు. దీనిని పోలీసులు కొట్టేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని వారు చెబుతున్నారు. ఈ గ్రామాన్ని చర్ల ఎస్సై సత్యనారాయణతో కలిసి సీఐ శ్రీనివాసులు పరిశీలించారు. రమేష్ భార్య నందిని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.ఈ హత్య మిస్టరీని పోలీసులే విప్పాలి. హంతకులు ఎవరో వారే చెప్పాలి. అప్పటిదాకా మనమంతా ఆగాలి -
ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్
చర్ల: ఖమ్మం జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని చర్లలో వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన మావోయిస్టులు మాడివి(25) అలియాస్ కోడి వినోద్, ముస్కి సోమ(23)లుగా గుర్తించారు. మావోయిస్టులు చర్ల మండలం భట్టిగూడెం గ్రామం. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చర్లలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పోస్టర్ల కలకలం రేగింది. జిల్లాలోని చర్ల మండల పరిషత్తు కార్యాలయం వద్ద మావోయిస్టు పార్టీ చర్ల, శబరీ ఏరియా కమిటీ పేరుతో పోస్టుర్లు వెలిసాయి. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారితే కఠిన చర్యలు తప్పవని. పోడు భూముల జోలికి వస్తే వదిలేది లేదని.. నకలీ విత్తనాలతో అమాయకులను మోసం చేయాలని చూస్తే ఇబ్బందులు తప్పవని.. నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని వ్యాపారులను హెచ్చరించారు. -
ఎన్కౌంటర్: మావోయిస్టు ఏరియా కార్యదర్శి మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ బార్చూర్ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్ మృతి చెందాడు. సంఘటన స్థలంలో ఏకే-47 ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దులో ఉన్న బస్తర్ జిల్లాలోని బుర్గుం పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అటవీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో తారసపడ్డ మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన బార్చూర్ ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్ మృతి చెందారు. మృతదేహం వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీని, కిట్‌బ్యాగ్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు ఏరియా కమిటీ కార్యదర్శి విలాప్పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ 16 లక్షల రివార్డ్‌ను ప్రకటించి ఉన్నట్లు తెలిసింది. -
ఇద్దరు మిలీషియా సభ్యులు అరెస్ట్
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసారంపాడు గ్రామానికి చెందిన మడకం మందయ్య, దుర్గ బండి ఇద్దరిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని జంగాలపల్లిలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఇద్దరు మిలీసియా సభ్యులను గుర్తించిర వారిని అరెస్ట్ చేశారు. వీరిపై పలు స్టేషన్ల పరిధిలో నాలుగు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్
చర్ల: మావోయిస్టుల పోస్టర్లు అంటిస్తున్న ఇద్దరు మావో సానుభూతిపరులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వెకటాద్రిపాలెంలో ఇద్దరు వ్యక్తులు మావోయిస్టుల పోస్టర్లు అంటిస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మండలంలోని బూరుగుపాడుకు చెందిన మడలి జోగయ్య, మడలి జోగ అనే ఇద్దరు ఏరియ కమిటీకి సానుభూతిపరులుగా పని చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
ఐదుగురు మావోయిస్టులు అరెస్ట్
చర్ల: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని వూసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సరిహద్దులో కార్యకలాపాలు కొనసాగిస్తున్న వారిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇద్దరు మావో కొరియర్ల అరెస్టు
చర్ల(ఖమ్మం జిల్లా): మావోయిస్టులు మందుపాతర్లను అమర్చేందుకు వినియోగించే ఎలక్ట్రిక్ వైరు బండిళ్లను తరలిస్తున్న ఇద్దరు కొరియర్లను చర్ల పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. చర్ల ఎస్సై తాళ్లపల్లి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... మండల కేంద్రమైన చర్లలో గాంధీ సెంటర్ సమీపంలోఅనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులకి తీసుకున్నారు. విచారణలో ఒకరిది చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్జిల్లా కారేపల్లికి చెందిన మడివి కోసా అని, మరొకరిది అదే జిల్లాలోని చండ్రంబోరు గ్రామానికి చెందిన మడకం కములు అలియాస్ మహేష్‌గా వెల్లడించారని ఆయన తెలిపారు. వారి నుంచి రెండు వైర్ బండిళ్లు లభ్యమైనట్లు ఆయన చెప్పారు. మావోయిస్టు నేతలు హరిభూషన్, దామోదర్, ఆజాద్ ఆదేశాల మేరకు రూ.40 వేలతో మహబూబాబాద్‌లోని మోహన్ అనే ఎలక్ట్రికల్ షాపు యజమాని వద్ద నుంచి 3 వేల మీటర్ల పొడవు గల 8 వైరు బండిళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు అంగీకరించారని ఆయన తెలిపారు. వీరిద్దరు పామేడు లోకల్ ఆర్గనేజేషన్ స్వా్కడ్ కమాండర్ కమలక్క నేతృత్వంలో పని చేస్తున్నట్లు వెల్లడించారని ఆయన చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై తాళ్లపల్లి సత్యనారాయణ తెలిపారు. -
సంతల్లో మావోయిస్టుల నోట్ల మార్పిడి
- ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు - రూ.70 వేల నగదు స్వాధీనం చర్ల: పెద్ద నోట్ల రద్దు కష్టాలు మావోయిస్టులకు కూడా తప్పడం లేదు. వారు నగదు మార్పిడి కోసం ఆదివాసీలు, గిరిజనులను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ఇద్దరు మావోయిస్టుల సానుభూతిపరులు అరెస్టు అవడంతో ఈ విషయం బయటపడింది. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణతో ఇద్దరు సానుభూతిపరులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద చర్ల పోలీసులు తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తున్న చర్లకు చెందిన గాదంశెట్టి రాజేష్, అజిత్ అనే ఇద్దరు సానుభూతిపరులను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి నిత్యావసర వస్తువులు, ప్రభుత్వం రద్దు చేసిన రూ.500 నోట్లు రూ. 70 వేల రూపాయల నగదును, ఏకే 47 విజిల్ కార్డులు 20 స్వాధీనం చేసుకున్నారు. పామేడు, బిజాపూర్, సుకుమా నుండి వారపు సంతలలో అధిక మొత్తంలో ఆదివాసీల ద్వారా మావోయిస్టులు తమ వద్ద ఉన్న డబ్బును మార్పిడి చేసుకుంటున్నారని చర్ల సీఐ సాయిరామన్ తెలిపారు. వారికి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
భద్రాద్రి జిల్లా సమగ్ర స్వరూపం
భద్రాద్రి కలెక్టర్ :రాజీవ్ గాంధీ హన్మంతు ఫోన్: 94909 57005 ఎస్పీ: అంబర్ కిషోర్ ఝా ఫోన్: 94407 95200 ఇతర ముఖ్య అధికారులు జేసీ: ఎం.రామకిషన్(94409 03166) ఓఎస్డీ: శోభన్ కుమార్(94407 95302) డీఆర్డీఏ, డ్వామా పీడీ: జగత్‌కుమార్ రెడ్డి (89781 59494) వైద్య ఆరోగ్య శాఖాధికారి: వెంకటేశ్వరరావు(98499 02522) మండలాలు: 23 (కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, జూలూరుపాడు, పాల్వంచ, ములకలపల్లి, అశ్వారం, మణుగూరు, పినపాక, కరకగూడెం, గుండాల, ఆళ్లపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట, దమ్మపేట, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు) మున్సిపాలిటీలు: 4 (కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు) గ్రామ పంచాయతీలు: 205 భారీ పరిశ్రమలు: సింగరేణి బొగ్గు గనులు, కేటీపీఎస్, నవభారత్ ఫెర్రో అల్లాయిస్, ఎన్ఎండీసీ–సిల్, భద్రాచలం పేపర్‌బోర్డ్, మణుగూరు హెవీ వాటర్‌ప్లాంట్, భద్రాద్రి పవర్‌ప్లాంట్ సాగునీటి ప్రాజెక్టులు: కిన్నెరసాని, సీతారాంసాగర్, తాలిపేరు, పెదవాగు, సింగభూపాలెం, మూకమామిడి ఎమ్మెల్యేలు: జలగం వెంకటరావు(కొత్తగూడెం), కోరం కనకయ్య(ఇల్లందు), పాయం వెంకటేశ్వర్లు(పినపాక), తాటి వెంకటేశ్వర్లు(అశ్వారావుపేట), సున్నం రాజయ్య(భద్రాచలం) ఎంపీలు: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(ఖమ్మం), సీతారాంనాయక్(మహబూబాబాద్) ఆలయాలు, పర్యాటకం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, పర్ణశాల, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో వెంకటేశ్వరస్వామి దేవాలయం, కిన్నెరసాని అభయారణ్యం, అశ్వారావుపేటలో గుబ్బల మంగమ్మ అటవీ ప్రాంతం జాతీయ రహదారి: విజయవాడ–జగదళ్‌పూర్(ఛత్తీస్‌గఢ్) పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్–ఖమ్మం–కొత్తగూడెంలను కలుపుతూ ఛత్తీస్‌గఢ్‌కు మరో హైవే కోసం ప్రతిపాదనలు పంపారు. హైదరాబాద్ నుంచి దూరం: 280 కి.మీ. ఖనిజ వనరులు: బొగ్గు గనులు -
ఏడుగురు మావోయిస్టుల అరెస్ట్
మావోయిస్టు పార్టీ మిలీషియా ప్లాటూన్ కమాండర్ సహా ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ రమణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు అటవీ పరిధిలోని చలమల, తాలిపేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో చర్ల ఎసై రవీందర్ నేతత్వంలో బుధవారం స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో ... వీరికి ఆరుగురు వ్యక్తులు తారసపడ్డారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, మావోయిస్టు పార్టీ మిలీషియూ సభ్యులని తెలిసింది. రాళ్లాపురం గ్రామానికి చెందిన మడవి జోగయ్య మావోయిస్టు పార్టీ మిలీషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్‌గా వ్యవహరిస్తుండగా, అదే గ్రామానికి చెందిన ముసికి కోసయ్య, కరటం ఉంగయ్య, ముసికి నందయ్య, పొడియం ఇరమయ్య, ముసికి రాజయ్యలు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారని సీఐ తెలిపారు. కమాండర్ జోగయ్యకు మూడు హత్యానేరాలు, 12 విధ్వంసకర ఘటనలతో సంబంధముందని సీఐ చెప్పారు. ఇతడి నుంచి ట్వల్ బోర్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఐదుగురుగు కూడా పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్నారన్నారు.