సాక్షి, ఖమ్మం: జిల్లాలోని చర్ల మండలంలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలకు చెందిన ముగ్గురు గిరిజన యువకులను రెండు రోజులు క్రితం మావోయిస్టులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వారిలో ఇద్దరు యువకులును మావోయిస్టులు హతమార్చినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబందించి వివరాలిలా ఉన్నాయి. చర్ల మండలంలోని బోదనెగ్రగామానికి చెందిన కుంజా బుజ్జితో పాటు చింతగుప్ప గ్రామానికి చెందిన ఒక యువకుడితో పాటు మరో యువకుడిని మావోయిస్టులు రెండు రోజుల క్రితం అపహరించుకుపోయినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజులు గడిచినా వారి ఆచూకీ లభించపోవడంతో ఇన్ఫార్‌నెపంతో వారిని హతమార్చినట్లు సమాచారం.
మాట్లాడే పనుందంటూ వారిని తీసుకెళ్లిన మావోయిస్టులు రెండు రోజులు దాటినప్పటికీ వారిని విడిచిపెట్టకపోవడంతో వారిని కిడ్నాప్ చేసినట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన గిరిజనులకు ఎటువంటి హాని తలపెట్టకుండా వారిని మానవతాదృక్పదంతో విడిచిపెట్టాలంటూ ఆదివాసీల సంఘాల పేరిట శనివారం పత్రికలకు లేఖలు అందాయి. ఎటువంటి తప్పిదాన్ని చేయని గిరిజన యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తక్షణమే మావోయిస్టులు కిడ్నాప్ చేసిన గిరిజన యువకులను విడిచిపెట్టాలంటూ మావోయిస్టులను గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment