ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కారణంగా పలు వాగులు పొంగిపొర్లుతుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తప్ప వాగు పొర్లి పొంగుతోంది. దీంతో మండలంలోని చింతగుప్ప, బోడనెల్లి, కుర్కడపాడు, కుర్నపల్లి, ఎర్రబోలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా బత్తినిపల్లి వాగు పొంగిపొర్లడంతో ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినిపల్లి, బట్టిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అశ్వారావుపేట లో 11 సెం.మీ వర్షపాతం నమోద అయింది.
Published Sat, Jun 20 2015 10:02 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement