మావోయిస్టు పార్టీ మిలీషియా ప్లాటూన్ కమాండర్ సహా ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ రమణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సరిహద్దు అటవీ పరిధిలోని చలమల, తాలిపేరు ప్రాజెక్టు ప్రాంతాల్లో చర్ల ఎసై రవీందర్ నేతత్వంలో బుధవారం స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు. వేర్వేరు ప్రాంతాల్లో ... వీరికి ఆరుగురు వ్యక్తులు తారసపడ్డారు.
వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, మావోయిస్టు పార్టీ మిలీషియూ సభ్యులని తెలిసింది. రాళ్లాపురం గ్రామానికి చెందిన మడవి జోగయ్య మావోయిస్టు పార్టీ మిలీషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్‌గా వ్యవహరిస్తుండగా, అదే గ్రామానికి చెందిన ముసికి కోసయ్య, కరటం ఉంగయ్య, ముసికి నందయ్య, పొడియం ఇరమయ్య, ముసికి రాజయ్యలు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారని సీఐ తెలిపారు. కమాండర్ జోగయ్యకు మూడు హత్యానేరాలు, 12 విధ్వంసకర ఘటనలతో సంబంధముందని సీఐ చెప్పారు. ఇతడి నుంచి ట్వల్ బోర్ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఐదుగురుగు కూడా పలు విధ్వంస ఘటనల్లో పాల్గొన్నారన్నారు.
ఏడుగురు మావోయిస్టుల అరెస్ట్
Published Thu, Nov 12 2015 8:10 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement