ఖమ్మంలో భారీ వర్షం | heavy rains in khammam distirict | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో భారీ వర్షం

Jun 20 2015 9:52 AM | Updated on Sep 3 2017 4:04 AM

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కారణంగా పలు వాగులు పొంగిపొర్లుతుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

చర్ల: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కారణంగా పలు వాగులు పొంగిపొర్లుతుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తప్ప వాగు పొర్లి పొంగుతోంది. దీంతో మండలంలోని చింతగుప్ప, బోడనెల్లి, కుర్కడపాడు, కుర్నపల్లి, ఎర్రబోలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా బత్తినిపల్లి వాగు పొంగిపొర్లడంతో ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినిపల్లి, బట్టిగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అశ్వారావుపేట లో 11 సెం.మీ వర్షపాతం నమోద అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement