చలమలలో వెలసిన మావోయిస్టు పార్టీ వాల్‌పోస్టర్లు
చలమల (చర్ల): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో పంటలను ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆయా కమిటీల పేరిట మండలంలోని పెదమిడిసిలేరు గ్రామపంచాయతీ పరిధిలో గల చలమలలో పెద్ద ఎత్తున మావోయిస్టులు వాల్‌పోస్టర్లు వేశారు. ఆదివాసీలకు పోడు భూముల హక్కులకై పోరాడాలని పిలుపునిచ్చారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతీ గిరిజన కుటుంబానికి 10 ఎకరాల భూమి దక్కాల్సి ఉండగా, హరితహారం పేరుతో అటవీశాఖాధికారుల ద్వారా సాగు భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందని , ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ పోరాడాలని పోస్టర్ల ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.