
పోరు.. ప్రచారం హోరు
రాజకీయ పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నారుు. వీధులు కళకళలాడుతున్నాయి. గోడలకు పోస్టర్లు అతుక్కుపోయూరుు.
సాక్షి, ఏలూరు : రాజకీయ పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నారుు. వీధులు కళకళలాడుతున్నాయి. గోడలకు పోస్టర్లు అతుక్కుపోయూరుు. అభ్యర్థులు, ప్రధాన పార్టీల నాయకులు ప్రతి గడపకూ వెళుతున్నారు. ఆశీ ర్వదించమని కోరుతున్నారు. మునిసిపల్, జిల్లా, మం డల పరిషత్ ఎన్నికల కోలాహలంతో పట్టణాలు, పల్లెలు సందడిగా మారారుు.
ఓటర్లలో రాజకీయ చైతన్యం బాగా పెరగడం.. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవి రిఫరెండంగా మారడంతో ప్రస్తుత ఎన్నికలకు ప్రాధాన్యత పెరిగింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసి మేండెట్స్ చేతికి రావడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు బుధవారం నుంచి ప్రచార గోదాలోకి దిగారు.
ఒక్కొక్క చోట ఒక్కో రకంగా...
కొల్లేరు గ్రామాల్లో పెద్దలు చెప్పిన వాళ్లకే జనం ఓటేసే సంప్రదాయం ఉంది. దాంతో అభ్యర్థులు పెద్దలను ప్రసన్న చేసుకునే పనిలో ఉన్నారు. తణుకు నియోజకవర్గంలో ఇంటింటా ప్రచారం హోరెత్తుతోంది. గోపాలపురంలో అభ్యర్థులు రోడ్లు, డ్రెయిన్ల సమస్య పరిష్కరిస్తామని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లడంతోపాటు మైకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తీన్‌మార్ డప్పులు, ఆటపాటలతో ప్రచారం చేస్తున్నారు.
నిడదవోలు నియోజకవర్గంలో ప్రచారం ఇంకా ఊపందుకోలేదు. తణుకులో జెడ్పీ అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. దెందులూరు, ఉంగుటూరులో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇతర పార్టీల కార్యకర్తలు వైసీపీలో చేరుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో కళాకారుల హవా ఎక్కువగా కనిపిస్తోంది.
మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి ముగింపు గడువు సమీపిస్తుండటంతో పరిషత్ అభ్యర్థుల వెనుక పెద్ద నాయకులు ప్రచారానికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో అభ్యర్థులే కళాకారులను, బంధువులను వెంట తీసుకుని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. మంచి ముహూర్తం కోసం కొందరు అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.