మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జిల్లాలోని 49 జెడ్పీటీసీ, 812 ఎంపీటీసీ స్థానాలకు గత నెలలో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. వీటి లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. జిల్లాలో 49 జెడ్పీటీసీ స్థానాలకు 177 మంది, 812 ఎంపీటీసీ
రీ-పోలింగ్ నేడే
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఐదు అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల ఏడో తేదీన నిర్వహించిన సాధారణ ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంలలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో రీ-పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. జిల్లాలో పది పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ జరుగుతున్నందున 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఒపీనియన్ పోల్స్ ప్రకటించటంపై నిషేదం విధించినట్లు కలెక్టర్ చెప్పారు.
ప్రాదేశిక ఫలితాలు నేడే
Published Tue, May 13 2014 1:52 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement