సాక్షి, ఏలూరు: ఎన్నికల్లో డబ్బు కీలకంగా మారింది. అభ్యర్థుల జయాపజ యాలను శాసిస్తోంది. పేరు, పలుకుబడితోపా టు ప్రజాసేవ చేయాలన్న తపన ఉన్నా ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారింది. మునిసిపల్, జిల్లా పరిషత్, సార్వత్రిక ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్నికల వ్యయం భారీగా పెరిగింది. అభ్యర్థుల రోజువారీ ఖర్చు తడిసి మోపెడవుతోంది.
ఒకప్పుడు అభ్యర్థి వెన్నంటి జనముంటే గెలుపు ఖాయమన్న భావన ఉండేది. ఇప్పుడు ఎంత ఖర్చు పెడితే గెలుపు అంత గ్యారంటీ అనే రోజులొచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలో కరెన్సీ కీలకమైందంటే అతిశయోక్తి కాదు.
గతంతో పోలిస్తే ఎక్కువే..
ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలంటే, డబ్బులిచ్చి పది మందిని వెంట తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కొక్కరికీ రూ.300 కూలితో పాటు బిర్యానీ ప్యాకెట్, మద్యం అందించాల్సి వస్తోంది. ఒక్కో అభ్యర్థి రోజుకు సగటున రూ.20 వేల ఖర్చు చేయాల్సి వస్తోందట.
ఇదే మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి అయితే రోజుకు రూ.40 వేల దాకా వ్యయం చేయాల్సి వస్తోంది. 2005 మునిసిపల్ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి ఖర్చు బాగా పెరిగినట్లు అభ్యర్థులే చెబుతున్నారు. అప్పట్లో కేవలం ఓట్లు కొనేం దుకు మాత్రమే లక్షల్లో వెచ్చించే అభ్యర్థులు నేడు నామినేషన్, ప్రచారం, పోలింగ్ ఖర్చులు కూడా భరించాల్సి వ స్తోంది.
కేవలం మునిసిపల్ ఎన్నికల్లోనే కాకుండా జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రచారం ముగిశాక రాత్రి 8 గంటలకు మా సంగతేంటని ఎదురుగా నిలబడే మందుబాబులను తృప్తి పరిచేందుకే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని అభ్యర్థులు గొల్లుమంటున్నారు.
డెల్టాలోనే బోలెడు ఖర్చు..
జిల్లాలో డెల్టా ప్రాంతమైన నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలులో ఎన్నికల వ్యయం ఎక్కువుగా కనిపిస్తోంది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి మొదలవ్వాల్సిన ప్రలోభాల పరంపరను పలువురు అభ్యర్థులు వారం రోజుల ముందు నుంచే ప్రారంభించారు.
ఈ విషయంలో టీడీపీ అభ్యర్థులు ఒకడుగు ముందే ఉన్నారు. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు మునిసిపాలిటీల్లో ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల వార్డు అభ్యర్థులు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ వ్యయం చేసేందుకు సిద్ధమయ్యారు. అదే చైర్మన్ అభ్యర్థి అయితే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందని విశ్లేషకుల అంచనా.
లక్షల్.. లక్షల్
Published Thu, Mar 27 2014 1:52 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement