
Prophet remarks row: బీజేపీ తాజా మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు వ్యతిరేకంగా గుజరాత్‌లో పోస్టర్లు వెలిశాయి. ముహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన కామెంట్లపై దుమారం చల్లారడం లేదు.
ఈ తరుణంలో గుజరాత్ సూరత్‌లోని జిలాని బ్రిడ్జి మీద నూపుర్ వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. ఆమెను తక్షణం అరెస్ట్ చేయాలంటూ ఆ పోస్టర్‌లో ఉంది. ఈ పని ఎవరు చేశారన్నది తెలియకపోవడంతో.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇస్లాం దేశాలు ఒక్కొక్కటిగా తమ వ్యతిరేకతను ప్రకటనల రూపంలో ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ఆమెపై కేసులు సైతం నమోదు అవుతున్నాయి.
చదవండి: నూపుర్‌కు అల్‌ఖైదా వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment