కొలనుపాకలో పోస్టర్ల కలకలం | Posters uproar in kolanupaka | Sakshi
Sakshi News home page

కొలనుపాకలో పోస్టర్ల కలకలం

Published Fri, May 27 2016 2:30 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Posters uproar in kolanupaka

నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని ప్రముఖ జైన క్షేత్రమైన కొలనుపాకలో ఇండియన్ సోషలిస్టు పార్టీ పేరిట వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనె చదివించాలని, సాగునీటి ప్రాజెక్టులలో అవినీతిని అరికట్టాలని పోస్టర్ లో పేర్కాన్నారు.

 

రెవెన్యూ అధికారులు ఆస్తులను ప్రకటించాలని హెచ్చరించారు. రియల్ మాఫియాను అదుపులోకి తేవాలని  ప్రకటించారు. కొలనుపాకలోని మెయిన్‌రోడ్డు, పంచాయతి కార్యాలయాల వద్ద జనగాం ఏరియా కమిటీ, ఇండియన్ సోషలిస్టు పార్టీ పేరిట ఈ పోస్టర్లు వెలిసాయి. అకస్మాత్తుగా వెలుగు చూసిన పోస్టర్లు ప్రజలను కలవర పెడుతున్నాయి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement