కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మధ్య జరుగుతున్న పోస్టర్ వార్ ఆసక్తిరేపుతోంది. బీజేపీ ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించని అసన్‌సోల్, డైమండ్ హార్బర్ లోక్‌సభ సీట్ల విషయంలో టీఎంసీ గోడలపై పోస్టర్లు వేసింది. క్యాండిడేట్ వాంటెడ్ అని షాడో ఫేస్ ఉన్న పోస్టర్లను వీధుల్లో అంటించారు. దమ్ముంటే బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత సువేందు అధికారి డైమండ్ హార్బర్ సీటు నుంచి పోటీ చేయాలని టీఎంసీ సవాల్ విసురుతోంది.
ఇక్కడి నుంచి ప్రస్తుతం టీఎంసీ జనరల్ సెక్రటరీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అసన్‌సోల్ నుంచి బీజేపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన పవన్‌సింగ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కొనితెచ్చుకున్నారు.
దీంతో బీజేపీ ఇక్కడ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అసన్‌సోల్‌లో పోటీ చేసేందుకు బీజేపీకి అభ్యర్థులే లేరని టీఎంసీ ఎద్దేవా చేస్తోంది. కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇదీ చదవండి.. బీజేపీకి షాక్ శివసేన(ఉద్ధవ్)లోకి సిట్టింగ్ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment