కోల్‌కతా: ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్‌లో బీజేపీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గర్బెటాలోని పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్‌టుడు ఆయన అనుచరులతో పోలింగ్ బూత్‌కు వెళ్లారు.
వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రణత్‌ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు.
ఈ ఘటనలో బీజేపీ నేత కారు ధ్వంసమైంది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని టీఎంసీ నేతలు కౌంటర్ ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment