మున్సిపల్ నోటీసు బోర్డుపై...
మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో బుధవారం మావోయిస్టుల పేర పోస్టర్లు కనిపించాయి. మున్సిపాలిటీ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపైనే ప్రత్యక్షమవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ‘డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలను సమరోత్సాహంగా హుందాగా జరుపుకోండి. యువతీయువకులు ప్రజాసైన్యంలో చేరండి. పోలీసుల్లో చేరకండి.
ప్రజాద్రోహులుగా మారకండి’ అంటూ ఆ పోస్టర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు. ‘శత్రువుల మరణం గట్టిపోస కంటే తేలికైందని, ప్రజల కొరకు మరణం హిమాలయాల కన్న ఉన్నతమైందంటూ అందులో పొందుపరిచారు. ఈ పోస్టర్లు సింగరేణి కోల్‌బెల్ట్ మావోయిస్టు (సీపీఐ మావోయిస్టు) పేరిట వెలిశాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వేశారు.
మందమర్రిలో మావోయిస్టు పోస్టర్లు
Published Thu, Nov 27 2014 1:07 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement