![మురళీకృష్ణ వైఖరికి వ్యతిరేకంగా పోస్టర్లు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41447218337_625x300.jpg.webp?itok=tDps9KV8)
మురళీకృష్ణ వైఖరికి వ్యతిరేకంగా పోస్టర్లు
హైదరాబాద్: ఉద్యోగుల తరలింపు వ్యవహారంలో ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ వ్యవహరిస్తున్నారంటూ సచివాలయంలో మంగళవారం పోస్టర్లు వెలిశాయి. ఇవి సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి పేరిట ఉన్నాయి.
కొత్త రాజధానికి వెళ్లడానికి ఉద్యోగులను సిద్ధం చేసినట్లు అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, నాయకుడు అలా చేయడం ధర్మం కాదని అందులో పేర్కొన్నారు. ఈ ధోరణిని ప్రశ్నించకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుందని, మరింతగా నష్టపోవాల్సి ఉంటుందని ఉద్యోగులను హెచ్చరించారు.