'పేసీఎం' పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చిన నటుడు | Actor Threatens Legal Action Against Congress Paycm Photo | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ 'పేసీఎం' పోస్టర్‌లో నటుడి ఫోటో.. కోర్టుకెళ్తానని వార్నింగ్

Published Fri, Sep 23 2022 6:52 PM | Last Updated on Fri, Sep 23 2022 6:52 PM

Actor Threatens Legal Action Against Congress Paycm Photo - Sakshi

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ '40 శాతం కమీషన్ సర్కార్‌' పేరుతో పేసీఎం పోస్టర్లను కాంగ్రెస్ ప్రచురించిన విషయం తెలిసిందే. సీఎం బసవరాజ్ బొమ్మై ఫోటో, క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న ఈ ఫోటోలు గోడలపై కన్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఓ పోస్టర్‌లో కాంగ్రెస్ తన ఫోటోను వాడుకుందని కన్నడ నటుడు అఖిల్ అయ్యర్‌ ఆరోపించాడు. తన అనుమతి లేకుండా తనకు సంబంధం లేని వ్యవహారంలో తన చిత్రాన్ని వాడటంపై అభ్యంతరం తెలిపాడు. 

ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్‌ను షేర్ చేసి, దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్‌ను హెచ్చరించాడు అఖిల్. దయచేసి ఈ విషయాన్ని పరిశీలించాలని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక కాంగ్రెస్‌ను ట్యాగ్ చేశాడు.

'అవినీతి ఆకలితో ఉన్న ఈ 40శాతం కమీషన్ సర్కార్ 54,000 మంది విద్యార్థుల కెరీర్‌ను దోచుకుంది. ఇంకా మీలో చలనం రాదా?' అని కాంగ్రెస్ ఓ పోస్టర్‌ను రూపొందించింది. ఇందులో నటుడు అఖిల్ ఫోటోను ఉపయోగించింది. దీనిపైనే ఆయన అభ్యంతరం తెలిపాడు.
చదవండి: బీజేపీకి వెన్నుపోటు పొడిచాడు: అమిత్‌షా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement