ప్రధాన రహదారిపై మావోయిస్టు పోస్టర్లు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు దర్శనమిచ్చాయి. చర్ల మండలం కలివేరు శివారు నుంచి తేగడ శివారు వరకు ప్రధాన రహదరిపై పోస్టర్లు తెల్లవారేసరికి వెలిశాయి. మే 23 నుంచి నక్సల్స్ 50వ వారోత్సవాలను గ్రామగ్రామాన జరపాలని మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ ఇందులో పిలుపునిచ్చింది.