‘చలో అమలాపురం’ పోస్టర్ విడుదల
‘చలో అమలాపురం’ పోస్టర్ విడుదల
Published Sun, Sep 4 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
కర్నూలు సీక్యాంప్: రాష్ట్రవ్యాప్తంగా దళితులపై పెరిగిపోతున్న దాడులు, వాటిని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 12న తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. బుధవారపేట ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అలిగిరి రవి మాదిగ మాట్లాడారు. ఆవు చర్మం వలిచినందుకు కోస్తాంద్రంలో దళితులను కొందరు దుండగులు చెట్టుకు కట్టేసి కొట్టారని, సభ్య సమాజంలో ఉంటున్న మనం ఇలాంటి పరిస్థితులను చూసి సిగ్గుపడాలని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల భూములను అగ్రకులస్తులు కబ్జా చేస్తున్నారని, వారికి అధికార పార్టీనేతలు అండదండలుండడం దురదష్టకరమన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాత్రిసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి నవీన్‌మాదిగ, కుమార్, రూబేన్, విజయ్, నరసింహులు, చిన్నలక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement