ధర్నాను విజయవంతం చేయండి | Make a strike sucess | Sakshi
Sakshi News home page

ధర్నాను విజయవంతం చేయండి

Published Wed, Dec 17 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

Make a strike sucess

 ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబుళపతి
 బెళుగుప్ప: ఉపాధ్యాయుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఈ నెల 20న  ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఓబుళపతి పిలుపునిచ్చారు. బెళుగుప్పలో   మంగళవారం వైఎస్సార్‌టీఎఫ్  జిల్లా  అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, ఉపాద్యక్షులు, సురేష్‌కుమార్, మల్లయ్య, అల్తాఫ్ హుస్సేన్,  కార్యదర్శులు జయరాం రవీంద్ర, నారాయణ, రాధాక్రిష్ణారెడ్డి తదితరులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
 
 అనంతరం ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఓబుళపతి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మెరుగైన పీఆర్‌సీని 60 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని, పాఠశాలల పనివేళలను పునఃసమీక్షించాలని, హెల్త్ కార్డుల్లోని  అసంబద్ధతలను తొలగించాలని యన డిమాండ్ చేశారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా కోశాధికారి ఫల్గుణప్రసాద్,  కమిటీ సభ్యులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమేశ్, మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement