ashok kumar reddy
-
వరాల దేవత.. ఎల్లమ్మ తల్లి
కలికిరి: కలికిరి పట్టణంలో వెలసిన కలికిరి గ్రామ దేవత, భక్తులు కోర్కెలు తీర్చే చల్లని తల్లి ఎల్లమ్మ తిరుణాల శనివారం నుంచి ప్రారంభమవుతుందని ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతరలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారని వివరించారు. జాతరలో భాగంగా ఆలయ ఆవరణంలో శనివారం రాత్రి అమ్మవారి హరికథా కాలక్షేపం, జాగరణ జరుగుతుందన్నారు. ►ఆదివారం ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తేరులో ప్రత్యేక అలంకరణ మధ్య కలికిరి పట్టణంలో ఊరేగింపు, తదుపరి సిద్దపూజ, అనంతరం మధ్యాహ్నం నుంచి భక్తులు అమ్మవారికి దీలు, బోణాలు సమర్పణ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే రాత్రికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రంగు రంగుల విద్తుత్దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన చాందినీ బండ్లు ఊరేగింపు, ప్రదర్శన చేపడతారన్నారు. ►సోమవారం నుంచి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం, రాత్రి లంకాదహనం, తేరులో పుష్పపల్లకి సేవ నిర్వహిస్తామన్నారు. మంగళవారం జరుగు పార్వేట ఉత్సవంతో జాతర ముగుస్తుందని చెప్పారు. జాతరకు 27 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు.. కలికిరి ఎల్లమ్మ జాతరను పురస్కరించుకుని పీలేరు ఆర్టీసీ డిపో నుంచి 27 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు పీలేరు డీఎం కె.కుమార్ తెలిపారు. 17న ఆదివారం, 18న సోమవారం రెండు రోజుల పాటు పీలేరు–కలికిరి 5 సర్వీసులు, కలికిరి–కలకడ మార్గంలో 6 సర్వీసులు, సోమల–కలికిరి 6, మదనపల్లి–కలికిరి 5 సర్వీసులు, కలికిరి–సదుం మార్గంలో 3, కలికిరి–వాయల్పాడు 2, మొత్తం 27 సర్వీసులను భ క్తుల సౌకర్యార్థం నడపనున్నామని, ఈ సదుపాయా న్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు. రెండు శతాబ్దాల నాటి ఆలయ చరిత్ర.. సుమారు రెండు శతాబ్దాల క్రితం కలికిరి పంచాయతీ చెరువుముందరపల్లికి చెందిన వర్తకులు వ్యాపార నిమిత్తం కర్నాటక రాష్ట్రం బెంగళూరుకు వెళ్లేవారని, అక్కడ కొనుగోలు చేసిన సరుకులను ఎడ్లబండి ద్వారా కలికిరి ప్రాంతానికి తీసుకువస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలో వ్యాపారులు సరుకులు తరలిస్తున్న ఎడ్లబండి ఇప్పుడు ఆలయం ప్రాంతంలోకి వచ్చి కదలకుండా నిలిచి పోయేది. వ్యాపారులు ఎన్ని ప్రయాత్నాలు చేసినా ఆ బండి ముందుకు సాగక పోవడంతో బండిలో ఉన్న బస్తాలను కిందకు దించుతుండగా వక్కల బస్తాలో అమ్మవారి విగ్రహం వెలుగులోకి వచ్చింది. దీంతో అమ్మవారిని అదే ప్రాంతంలో విగ్రహ ప్రతిష్ట చేయించి ఆలయం నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు కలికిరి గ్రామ దేవతగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ►ఆలయం ఏర్పాటైన నాటినుంచి కలికిరి రెడ్డివారిపల్లికి చెందిన రెడ్డివారి కుటుంబీకులు ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ అంచెలంచెలుగా ఆలయాన్ని అభివృద్ధి చేపట్టారు. అలాగే ఉమ్మడిశెట్టి కుటుంబీకులు ఆలయ అర్చకులుగా వ్యవహరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆషాడమాసంలో అమ్మవారికి పెద్ద ఎత్తున తిరుణాల నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. -
జంట హత్యతో కలకలం
వివాహేతర సంబంధమే కారణం ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు హత్య బుక్కచెర్ల గ్రామంలో విషాద ఛాయలు జంట హత్యలతో ‘అనంత’ ఉలిక్కిపడింది. అనంతపురం రూరల్ మండలం రుద్రంపేట సమీపంలో గోపీనాయక్, వెంకటేశ్నాయక్ల హత్యను మరువకనే ఇదే మండలం కక్కలపల్లి గ్రామ సమీపంలో మరో జంట హత్య వెలుగు చూడటం కలకలం రేపింది. తాజాగా జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిసింది. అనంతపురం సెంట్రల్ : వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు... రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు జయచంద్రారెడ్డి (22) ఆటో డ్రైవర్. ఇతను గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఆమె బంధువులకు తెలియడంతో కొంత కాలం క్రితం గొడవ జరిగింది. పద్ధతి మార్చుకోవాలని జయచంద్రారెడ్డిని పలుమార్లు హెచ్చరించారు. అయినా మార్పు రాకపోవడంతో విసిగిపోయిన మహిళ బంధువులు జయచంద్రారెడ్డిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. అదును చూసి.. అంతమొందించారు.. జయచంద్రారెడ్డి అక్క కుమారుడికి గురువారం సాయంత్రం కుక్క కరిచింది. కుటుంబ సభ్యులతో కలిసి బాలుడిని తీసుకుని రాత్రి 9.30గంటలకు అనంతపురం సర్వజనాసుపత్రికి తన ఆటోలో తీసుకొచ్చాడు. అక్కడ అడ్మిషన్ చేయించిన అనంతరం అదే రోజు రాత్రి తన స్నేహితుడు అశోక్‌కుమార్‌రెడ్డి(22)తో కలిసి స్వగ్రామానికి బయల్దేరాడు. అప్పటికే కాపు కాచిన మహిళ బంధువులు ఆటోను అటకాయించారు. మార్గమధ్యంలో ఇద్దరిపై దాడి చేసి, తాడులతో గొంతు బిగించి హతమార్చారు. అనంతరం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి గ్రామ సమీపంలో రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. జయచంద్రారెడ్డి–అశోక్‌కుమార్‌రెడ్డి మృతితో బుక్కచెర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు జంట హత్యలు జరిగిన విషయం వెలుగులోకి రావడంతో అనంతపురం రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్ఐలు జగదీష్, నాగేంద్రప్రసాద్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుల బంధువులు ఫిర్యాదు మేరకు రాప్తాడు మండలం కొత్తపల్లికి చెందిన మహిళ సోదరుడు సోమనాథ్యాదవ్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ధర్నాను విజయవంతం చేయండి
ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబుళపతి బెళుగుప్ప: ఉపాధ్యాయుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఈ నెల 20న ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఓబుళపతి పిలుపునిచ్చారు. బెళుగుప్పలో మంగళవారం వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, ఉపాద్యక్షులు, సురేష్‌కుమార్, మల్లయ్య, అల్తాఫ్ హుస్సేన్, కార్యదర్శులు జయరాం రవీంద్ర, నారాయణ, రాధాక్రిష్ణారెడ్డి తదితరులతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఓబుళపతి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. మెరుగైన పీఆర్సీని 60 శాతం ఫిట్మెంట్తో ప్రకటించాలని, పాఠశాలల పనివేళలను పునఃసమీక్షించాలని, హెల్త్ కార్డుల్లోని అసంబద్ధతలను తొలగించాలని యన డిమాండ్ చేశారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా కోశాధికారి ఫల్గుణప్రసాద్, కమిటీ సభ్యులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రమేశ్, మండల నాయకులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీరు దుర్మరణం
ప్రమాదవశాత్తు రైలు కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన ఇక్కడి కంటోన్మెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన అశోక్‌కుమార్ రెడ్డి (28) బెంగళూరు కళ్యాణనగరలోని విజయా బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న అశోక్‌రెడ్డికి ఎనిమిది నెలల క్రితమే వివాహం అయ్యింది. ఐటీసీ ఫ్యాక్టరీ సమీపంలోని మైదానంలో రోజు ఉదయం జాగింగ్ వచ్చే అశోక్‌రెడ్డి బుధవారం ఎప్పటిలాగే ఉదయం రైల్వే పట్టాల సమీపంలో బైక్ పార్క్ చేసి మైదానంలోకి వెళ్లాడు. కొద్ది సేపు జాగింగ్ అనంతరం ఇంటికి బయలుదేరాడు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. రైలు వస్తున్న విషయం గుర్తించలేకపోవడంతోనే అశోక్ కుమార్ రెడ్డి మృతి చెందాడని రైల్వే పోలీసులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని కంటోన్మెంట్ రైల్వే పోలీసులు తెలిపారు.