రైలు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీరు దుర్మరణం | Software engineer died in Rail accident in Bangalore | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీరు దుర్మరణం

Published Thu, Jul 10 2014 8:36 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

రైలు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీరు దుర్మరణం - Sakshi

రైలు ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీరు దుర్మరణం

ప్రమాదవశాత్తు రైలు కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన ఇక్కడి కంటోన్మెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన అశోక్‌కుమార్ రెడ్డి (28) బెంగళూరు కళ్యాణనగరలోని విజయా బ్యాంకు కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న అశోక్‌రెడ్డికి ఎనిమిది నెలల క్రితమే వివాహం అయ్యింది. ఐటీసీ ఫ్యాక్టరీ సమీపంలోని మైదానంలో రోజు ఉదయం జాగింగ్ వచ్చే అశోక్‌రెడ్డి బుధవారం ఎప్పటిలాగే ఉదయం రైల్వే పట్టాల సమీపంలో బైక్ పార్క్ చేసి మైదానంలోకి వెళ్లాడు.

 

కొద్ది సేపు జాగింగ్ అనంతరం ఇంటికి బయలుదేరాడు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొని దుర్మరణం చెందాడు. రైలు వస్తున్న విషయం గుర్తించలేకపోవడంతోనే అశోక్ కుమార్ రెడ్డి మృతి చెందాడని రైల్వే పోలీసులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నామని కంటోన్మెంట్ రైల్వే పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement