సాప్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం కేసు | Rape case file on Software engineer in Bangalore | Sakshi
Sakshi News home page

సాప్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం కేసు

Published Sun, Sep 14 2014 6:07 PM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

సాప్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం కేసు - Sakshi

సాప్ట్వేర్ ఇంజనీర్ పై అత్యాచారం కేసు

బెంగళూరు: తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీరు ఇక్కడి ఆర్టీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడి ఆర్టీ నగర్లోని గంగానగరలో నివాసం ఉంటున్న రవీంద్రనాయక్ బాదామి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రవీంద్ర నాయక్ వైట్ఫీల్డ్లోని హెచ్పీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఇటీపీఎల్లోని ఎస్ఏపీ ల్యాబ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న యువతి ఏఈసీఎస్ లేజౌట్లోని పీజీ (హాస్టల్)లో నివాసం ఉంటోంది.

ఈ యువతి, రవీంద్రకు గత ఏడేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి... తన ఇంటికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసం చేసి ఇదే నెల 7వ తేదీన మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని పోలీసులకు తెలిపింది. వంచన, అత్యాచారం, మోసంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement