తండ్రీ కొడుకుల అనుబంధం | Kavin PaPa Movie Releasing on January 3: Neeraja Kota | Sakshi
Sakshi News home page

తండ్రీ కొడుకుల అనుబంధం

Published Tue, Dec 31 2024 12:07 AM | Last Updated on Tue, Dec 31 2024 12:07 AM

Kavin PaPa Movie Releasing on January 3: Neeraja Kota

కవిన్, అపర్ణా దాస్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డా..డా’. గణేశ్‌ కె.బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. భాగ్యరాజా, వీటీవీ గణేశ్, ఐశ్వర్య, ప్రదీప్‌ శక్తి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ‘΄పా..పా..’ పేరుతో జేకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట తెలుగులో విడుదల చేస్తున్నారు. జనవరి 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ చిత్రం విడుదల కానుంది.

నీరజ కోట మాట్లాడుతూ– ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘΄పా..పా..’. భావోద్వేగం, ప్రేమ, వినోదం... ఇవన్నీ సమ పాళ్లలో ఉన్న ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ డ్రామా ఇది. తమిళంలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు ఈ మూవీని విడుదల చేయనున్నారు’’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement