శ్రీవారి సేవలో దేవర భామ.. వీడియో వైరల్! | Janhvi Kapoor Visits Tirumala Temple With Rumoured BF Shikhar Pahariya | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ప్రియుడితో కలిసి తిరుమలకు జాన్వీ కపూర్.. వీడియో వైరల్!

Published Wed, Mar 6 2024 2:41 PM | Last Updated on Wed, Mar 6 2024 4:34 PM

Janhvi Kapoor Visits Tirumala Temple With Rumoured BF Shikhar Pahariya - Sakshi

శ్రీదేవి ముద్దుల కూతురు, దేవర భామ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధడక్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇటీవల అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో మెరిసిన ముద్దగుమ్మ ఇవాళ తన 27వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్‌కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగ పోస్టులు పెడుతున్నారు.

తాజాగా తన బర్త్‌ డేను పురస్కరించుకుని జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్ పహారియా, శ్రీదేవి సిస్టర్ మహేశ్వరి,  ఓర్రీ కూడా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన జాన్వీ కపూర్ స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.  దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. జాన్వీ కపూర్‌.. దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement