
అటు సోషల్ మీడియాలో ఇటు బాలీవుడ్ పార్టీల్లో కనిపిస్తూ ఓ వ్యక్తి తెగ పాపులర్ అయిపోయాడు. అలా అని ఇతడు హీరోనా అంటే కాదు. జస్ట్ స్టార్ హీరోహీరోయిన్లతో కలిసి ఫొటోలు దిగుతాడంతే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వైరల్ అయిపోతుంటాడు. అయితే ఇలా ఫొటోలు దిగడం ఏదో సరదా కోసమని అనుకున్నారేమో. కానీ ఇదే పనితో ఏకంగా లక్షలు సంపాదిస్తున్నాడట.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా)
ఫొటోలు దిగితే ఏమొస్తుందిలే అనుకున్నే వాళ్లకు ఓరీ అలియాస్ ఓర్హన్ అవత్రమని షాకిచ్చారు. తను రోజుకి ఓ రెండు ఫొటోలు వరకు దిగుతానని, తలో రూ.25 లక్షలు చొప్పున దీనికోసం అందుకుంటానని తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ చెప్పాడు. గతంలో రూ.30 లక్షలు అని చెప్పాడు. ఇప్పుడేమో రేటు పెంచేశాడు.
అయితే తనని ఎవరైనా ఫొటో అడిగితే రూ.25 లక్షలు తీసుకుంటానని.. తనకి ఇవ్వాలని అనిపిస్తే మాత్రం ఫ్రీగానే ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఎవరైనా టచ్ చేయమని చెబితే దానికి కూడా ఏకంగా రూ.20 లక్షలు ఛార్జ్ చేస్తానని అన్నాడు. తనకు పనిచేయడం అంటే ఇష్టముండదని, అందుకే ఇలా ఈవెంట్స్‌కి హాజరవుతూ, ఫొటోలకు పోజులిస్తూ ఆదాయం పెంచుకుంటున్నానని ఓరీ చెప్పాడు. ఇదంతా విన్నోళ్లు అవాక్కవుతున్నారు.
(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్)
Comments
Please login to add a commentAdd a comment