ఓర్రీ న్యూ లుక్‌.. నెటిజన్స్‌ దారుణ ట్రోల్స్! | Orry Gets Brutally Trolled For His New Look And Mocking 9-5 Jobs, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Trolls On Orry New Look: ఓర్రీ న్యూ హెయిర్‌ స్టైల్.. నెటిజన్స్‌ దారుణ ట్రోల్స్!

Published Sun, Jul 28 2024 9:48 PM | Last Updated on Mon, Jul 29 2024 1:33 PM

Orry Brutally Trolled For His New Look

సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అందరూ తహతహలాడతారు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇతడితో ఫోటో దిగేందుకు ఎగబడతారు. అతడే ఓర్రీ.. పూర్తి పేరు ఓర్హాన్‌ అవత్రమణి. సినీతారలు. హీరోయిన్లకు ఇతడు బెస్ట్‌ ఫ్రెండ్‌.. బాలీవుడ్‌లో అంతలా ఫేమస్ అయ్యాడు. రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఓర్రీ తాజాగా న్యూ హెయిర్‌ కట్‌తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. నేను ప్రతి సాయంత్రం మేల్కొంటాను.. మీరు ఇప్పటికీ 9 నుంచి 5 వరకు పనిచేస్తూనే ఉంటారు.. అది ఎంత చెడ్డదోనని ఆశ్చర్యపోతున్నానంటూ పోస్ట్ చేశారు.

‍అయితే ఒర్రీ హెయిర్‌ స్టైల్‌పై నెటిజన్స్‌ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. అతని న్యూ లుక్‌ను ఉద్దేశించి నెటిజన్స్‌ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అతని లుక్‌ను చికెన్ హెయిర్ కట్ అంటూ కోడిపుంజుతో కొందరు పోల్చారు. మరికొందరేమో నా పాతబట్టలు తీసుకోండి అంటూ సలహా ఇచ్చాడు. ఇంకొందరైతే ఏకంగా చికెన్‌ సెంటర్‌లో పనిచేసే వాడిలా ఉన్నాడంటూ కామెంట్స్ చేశారు.

ఎవరీ ఓర్రీ...

ఓరీ గురించి వివరాలు ఆరా తీస్తే... అతడు న్యూయార్క్‌ పార్సన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇతడు ఓ సామాజిక కార్యకర్త కూడా! మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.. దీని గురించి ఓరీ ఓసారి మాట్లాడుతూ.. 'నేను ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ కావాలనుకున్నాను. కానీ ఏమయ్యాను? రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, క్రియేటివ్‌ డైరెక్టర్‌గా, స్టైలిష్‌గా, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా.. ఇలా రకరకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు ఫుట్‌బాల్‌ కూడా ఆడతాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement