
సెలబ్రిటీలతో ఫోటోలు దిగాలని అందరూ తహతహలాడతారు.. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇతడితో ఫోటో దిగేందుకు ఎగబడతారు. అతడే ఓరీ.. పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమణి. తారలు.. ముఖ్యంగా హీరోయిన్లకు ఇతడు బెస్ట్ ఫ్రెండ్.. బాలీవుడ్‌లో ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ వాలిపోతాడు. వారిపై చేయి వేసి ఫోటో దిగుతుంటాడు. అలా అతడు చేయి ఆనిస్తే అవతలి వారి వయసు తగ్గిపోయినట్లు ఫీల్ అవుతారట!
ఎవరీ ఓరీ..
ఓరీ గురించి వివరాలు ఆరా తీస్తే... అతడు న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. ఇతడు ఓ సామాజిక కార్యకర్త కూడా! మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీని గురించి ఓరీ ఓసారి మాట్లాడుతూ.. 'నేను ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకున్నాను. కానీ ఏమయ్యాను? రచయితగా, సింగర్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, స్టైలిష్‌గా, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా.. ఇలా రకరకాల పనులు చేస్తున్నాను. కొన్నిసార్లు ఫుట్‌బాల్ కూడా ఆడతాను.
పార్టీలో ఫోటోలు దిగితే..
నా దృష్టిలో జీవితమంటే కలలు కనడం.. ఆ కలల్లో విహరించడం.. వాటిని సాకారం చేసుకునేందుకు దొరికిన అవకాశాన్ని వాడుకోవడం' అని చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. అది సరే.. ఇంతకీ ఎంత సంపాదిస్తాడు? అనుకుంటున్నారా? స్టార్ హీరోహీరోయిన్లకన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. జస్ట్ ఒక్క పార్టీకి వెళ్లి అక్కడున్నవారితో ఫోటోలు దిగితే చాలు.. రూ.20-30 లక్షలు ఇస్తారట! ఓరీయే ఈ విషయం చెప్పాడు.
తింటాడు, కానీ బిల్లు కట్టడు
ఇతడికి ఐదుగురు మేనేజర్లు ఉన్నారు. ఇద్దరు సోషల్ మీడియా మేనేజర్స్, ఒక పీఆర్ మేనేజర్, అన్ని బ్రాండ్లు చూసుకోవడానికి ఓ మేనేజర్, తను ఏం తింటున్నాడో చూసేందుకో మేనేజర్ ఉన్నారు. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్తే కూడా ఎంచక్కా కావాల్సింది తినేసి బిల్లు కట్టకుండా దానికి బదులు సెల్ఫీ ఇచ్చి వెళ్లిపోతాడట! ఈ మధ్య అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లోనూ తెగ హడావుడి చేశాడు. అనంత్‌కు కాబోయే భార్య రాధిక మర్చంట్‌తో కలిసి దాండియా ఆడాడు. ఫోటోలు దిగాడు. ఆ సెలబ్రేషన్స్‌కు వచ్చిన పాప్ సింగర్ రిహాన్నాతో కలిసి ఫోటోలు క్లిక్‌మనిపించాడు. తన ఇయర్ రింగ్స్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు.
#orry and #RadhikaMerchant wonderful garba dance #AnantRadhikaWedding pic.twitter.com/wBrVupiH9W
— Media Buzz (@brain_bursts_) March 13, 2024
Comments
Please login to add a commentAdd a comment