నటి సురేఖావాణితో వైరల్ స్టార్.. ఇతడెవరో గుర్తుపట్టారా? Orry With Surekha Vani Pic Viral | Sakshi
Sakshi News home page

Surekha Vani: సురేఖావాణి లేటెస్ట్ ఫొటో.. ఏకంగా అతడితో

Published Tue, Jun 11 2024 6:29 PM

Orry With Surekha Vani Pic Viral

నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది గానీ ఇన్ స్టాలో మాత్రం కూతురితో కలిసి దర్శనమిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం బాలీవుడ్‌లో వైరల్ స్టార్ ఓరీతో క్యూట్ పోజులిచ్చి చాలామందిని అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ సురేఖావాణి పక్కనున్నది ఎవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే)

పైన ఫొటోలో సురేఖావాణి భుజంపై చేయి వేసి క్లోజ్‌గా ఉన్న వ్యక్తి పేరు ఓరీ. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీలతో కనిపిస్తున్న ఒకేఒక్కడు ఇతడే. అలా అని ఇతడు యాక్టర్ కాదు. ఇతడి చేసే పనెంటో పెద్దగా తెలియదు. కానీ హిందీ హీరోయిన్లకి మాత్రం బెస్టీ. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి హీరోయిన్లతో ఎప్పుడూ అంటిపెట్టుకుని కనిపిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు తెలుగు నటి సురేఖా వాణితో కనిపించడం ఆసక్తికరంగా మారింది.

అలానే సురేఖావాణి, ఓరీ ఎక్కడ ఎప్పుడు కలిశారనే విషయాలు తెలియదు. హైదరాబాద్ లేదా ముంబయిలో పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది. ఎక్కడనేదా సురేఖావాణి చెబితే తప్పితే క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా ఓరీ దగ్గర ఐదుగురు మేనేజర్లు పనిచేస్తున్నారు. ఇతడితో ఫొటో దిగాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని ఇతడే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు సురేఖావాణి కూడా అలానే ఫొటో దిగిందా అనే సందేహం?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

Advertisement
 
Advertisement
 
Advertisement