
బాలీవుడ్‌లో ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ వాలిపోతాడు ఓరీ.

ఇతడి పూర్తి పేరు ఓర్హాన్ అవత్రమని.

పార్టీ ఏదైనా, ఎవరిదైనా తను ఉండాల్సిందే!

అయితే ఇన్నాళ్లూ సినీతారల పార్టీలోనే సందడి చేస్తాడనుకుంటే..

ఇటీవల అంబానీ ఇంట సెలబ్రేషన్స్‌లోనూ తెగ హడావుడి చేశాడు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఓరీ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారాడు.

అందరితో వెరైటీ పోజులిస్తూ ఫోటోలు దిగడమే కాకుండా అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్‌తో కలిసి దాండియా కూడా ఆడటం విశేషం.

ఓరీ హడావుడికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


