టాలీవుడ్‌లో మోస్ట్ లక్కీ హీరోయిన్ శృతిహాసన్. అవును మీరు సరిగానే విన్నారు. 2023లో చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ లాంటి హీరోలు హిట్ కొట్టారు. అయితే వీళ్ల సినిమాలన్నింటినిలోనూ శృతిహాసన్ ఉంది. అలా ప్రస్తుతం అదృష్ట కథానాయికగా మారిపోయింది. వరస చిత్రాలతో బిజీగా ఉన్న ఈమె రహస్యంగా పెళ్లి చేసుకుందనే న్యూస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఈ వార్త ఎందుకొచ్చింది?
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్)
గతంలో హీరో సిద్ధార్థ్‌తో శృతిహాసన్ రిలేషన్ లో ఉందని వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత వీళ్లిద్దరూ సెపరేట్ అయిపోయారు. కొన్నాళ్లకు ఓ ఫారినర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. పెద్ద టైమ్ తీసుకోకుండానే ఇతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది. కొన్నాళ్ల నుంచి అసోంకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజరికాతో కలిసి ఉంటోంది. శృతి అయితే శంతను తన ఫ్రెండ్ అని చెబుతూ వస్తోంది. కానీ వీళ్లని చూస్తే మాత్రం అలా అనిపించదు.
ఇకపోతే బాలీవుడ్‌లో ఈ మధ్య ఒర్రీ అనే వ్యక్తి ఫేమస్ అయ్యాడు. పలువురు హీరోయిన్లతో ఫొటోల్లో కనిపిస్తున్న ఇతడు.. తాజాగా ఓ ప్రశ్నకు బదులిస్తూ శృతిహాసన్‌పై కామెంట్స్ చేశాడు. అనవసరమైన యాటిట్యూడ్ చూపిస్తుందని, తనతో కూడా రూడ్‌గా ప్రవర్తించిందని ఒర్రీ చెప్పాడు. శృతి భర్త శంతను మాత్రం తనకు మంచి ఫ్రెండ్ అని అన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై స్పందించిన శృతిహాసన్.. 'నేను పెళ్లి చేసుకోలేదు. అయినా ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడతాను. నా గురించి తెలియని వాళ్లు నోరు మూసుకుంటే మంచిది' అని ఒర్రీ కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చింది.
(ఇదీ చదవండి: హీరోయిన్ కీర్తి సురేశ్ షాకింగ్ డెసిషన్.. దానికి గ్రీన్ సిగ్నల్)
Comments
Please login to add a commentAdd a comment