
లైగర్ బ్యూటీ అనన్య పాండే ఇటీవలే బర్త్‌డే జరుపుకుంది.

అక్టోబర్ 30న 26వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది.

ఈ క్రమంలో ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చింది.

ఈ పార్టీలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్, కరణ్ జోహార్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా తదితరులు ఉన్నారు.

ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే ఓరీ అనన్య బర్త్‌డే వేడుకల్లోనూ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా అక్కడున్న సెలబ్రిటీలపై చేయి వేస్తూ ఫోటోలకు పోజిచ్చాడు.

ఇది చూసిన నెటిజన్లు ఇక్కడ కూడా నువ్వే ఉన్నావా? అని కామెంట్లు చేస్తున్నారు.











