సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం సొమ్మును పక్కదారి పట్టించిన విషయంపై వ్యవసాయ శాఖ స్పందించింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో జరిగిన అక్రమాలు, మరణించిన లబ్దిదారుల పేరుతో ఇతరులు రైతుబంధు సొమ్ము తీసుకుంటున్న వైనంపై ‘రైతుబంధు పక్కదారి’శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు.
నల్లగొండ ఏడీఏ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో దేవరకొండ ఏడీఏ వీరప్పన్, ఇతర అధికారులు ముడుదండ్లలో శుక్రవారం విచారణ నిర్వ హించారు. పెరికేటి రాఘవాచారి కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నా రు. రైతుబంధు డబ్బులు రెండేళ్లుగా ఇతరుల అకౌంట్లలో జమ అవుతున్న తీరును అడిగారు. లబ్దిదారులు వాస్తవాలను అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఏడీఏ విచారణ నివేదిక ఇవ్వగానే అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment