nalagonda district
-
నల్లగొండ జిల్లా తిప్పర్తి దగ్గర రోడ్డు ప్రమాదం
-
కాంగ్రెస్ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం
సాక్షి, యాదాద్రి, మిర్యాలగూడ, ఎల్బీనగర్/మన్సూరాబాద్: ‘కాంగ్రెస్ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం’అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని 55 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వమనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వలి గొండ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రావడం లేదంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కరెంట్ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగుకు అర్ధరాత్రి కరెంట్ ఇస్తే భార్యాపిల్లలను వదిలి పాములు, తేళ్లు, విష పురుగుల భయంతో పొలానికి మోటారు పెట్టడాని కి వెళ్లేవారని చెప్పారు. చీకట్లో కరెంట్ షాక్‌కు గురై అనేక మంది రైతన్నలు ప్రాణాలు వదిలారని.. ఆ రైతుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు. వారి హయాంలో విత్తనాలు, ఎరువు ల కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాయా ల్సి వచ్చేదని.. కానీ, స్వరాష్ట్రంలో రైతులకు అలాంటి అవస్థలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌గాందీకి వ్యవసాయం తెలియదు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి వ్యవసాయం గురించి తెలియదని, పబ్బులు క్లబ్బులు మాత్రమే తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే పింఛన్ రూ.4 వేలు ఇస్తామని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అందరూ ప్రియమైన ప్రధాని అని అంటున్నారు.. కానీ ప్రధాని మోదీ పిరమైన ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. బీజేపికి ఓట్లు వేస్తే మూసీలో వేసినట్లే అన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి జాబ్ కేలెండర్‌ను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి మద్దతుగా ఎల్బీనగర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. మన్సూరాబాద్, బీఎస్‌రెడ్డినగర్ చౌరస్తాలలో మంత్రి మాట్లాడుతూ, టీఎస్పీఎస్సీలోని తప్పులను సవరించి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగులను నియమిస్తామన్నారు. కొత్తపేట ప్రూట్‌మార్కెట్ స్థలంలో అధునాతన వెయ్యి పడకల టిమ్స్ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటూ సీఎం కుర్చీ కోసం 11 మంది కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి అన్యాయం అయ్యారని, మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలపై కేటీఆర్ పరుష పదజాలం ప్రతిపక్ష పార్టీల నేతలపై కేటీఆర్ నిప్పులు చెరి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో రోడ్‌షో సందర్భంగా.. ‘ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ, ఇంటికో ఉద్యోగం ఎక్కడ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ’అని కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘55 ఏళ్లు పరిపాలించిన వాళ్లు ఏం పీకారు. అడగడానికి ఇజ్జత్ లేదు, మానం లేదు. ఆ సన్నాసులు అడుగుతున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని, వీపు పగులగొట్టే వాళ్లు లేకనా’అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. -
నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడుచోట్ల సీఎం సభలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుంటారు. 1.50 గంటలకు అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. 2.30 గంటలకు కోదాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 3.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు ఆలేరుకు చేరుకుంటారు. అక్కడ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారు. కాగా, ఈ నెల 31వ తేదీన సీఎం మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
‘రైతుబంధు పక్కదారి’ నిజమే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం సొమ్మును పక్కదారి పట్టించిన విషయంపై వ్యవసాయ శాఖ స్పందించింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో జరిగిన అక్రమాలు, మరణించిన లబ్దిదారుల పేరుతో ఇతరులు రైతుబంధు సొమ్ము తీసుకుంటున్న వైనంపై ‘రైతుబంధు పక్కదారి’శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. నల్లగొండ ఏడీఏ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో దేవరకొండ ఏడీఏ వీరప్పన్, ఇతర అధికారులు ముడుదండ్లలో శుక్రవారం విచారణ నిర్వ హించారు. పెరికేటి రాఘవాచారి కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నా రు. రైతుబంధు డబ్బులు రెండేళ్లుగా ఇతరుల అకౌంట్లలో జమ అవుతున్న తీరును అడిగారు. లబ్దిదారులు వాస్తవాలను అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఏడీఏ విచారణ నివేదిక ఇవ్వగానే అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత తెలిపారు. -
అన్నీ కలిసొస్తే ఈమె గురించి దేశమే మాట్లాడుకునేది కానీ...
-
Munugode Bypoll: కాస్ట్లీ ఓటు కుటుంబానికి రూ.40 వేలు!
పారదర్శక టెండర్ల ద్వారానే కాంట్రాక్టు దక్కింది. రాజకీయంగా ఎదుర్కోలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. లేకపోతే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలి. తడిబట్టలతో యాదాద్రి ఆలయం గర్భగుడికి రండి ప్రమాణం చేద్దాం. – బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ఛాలెంజ్ చేస్తున్న. ఆ రూ.18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి. ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాధేయపడైనా ఒప్పిస్తా. ఒక వ్యక్తి కోసం రూ.18 వేల కోట్లు ఇవ్వడం ఏంటి. ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎనిమిది సంవత్సరాల్లో కనీసం రోడ్డు వేయలేని వారు ఓటు అడగడానికి వస్తున్నారు. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిండి ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు నిధులు ఇప్పించాకే మునుగోడులో ఓటు అడగాలి. టీఆర్ఎస్ సర్కారు భీమనపల్లికి కనీసం రోడ్డు కూడా వేయలేదు. – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రెండు రోజుల నుంచి నియోజకవర్గం మొత్తం ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకుల ప్రచారాలతో మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా ప్రచార కార్యక్రమాలే. పోటాపోటీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తుతోంది. వాటిల్లో పాల్గొన్న పార్టీల ముఖ్య నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వíßహించారు. ఓవైపు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్.. ప్రతి సవాల్ చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. పోటాపోటీగా విమర్శలు ప్రచారంలో పాల్గొంటున్న నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రచార పర్వంలో రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తే.. రాగోపాల్రెడ్డిని టార్గెట్ చేసి మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శల బాణం ఎక్కు పెట్టారు. పరస్పర విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం నామినేషన్ వేశాక రాజగోపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబ పాలన, చూపుతున్న వివక్షను ఎత్తిచూపుతూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను నిరూపించాలంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కొరటికల్ గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని, ఆ ని«ధులేవో మునుగోడు, జిల్లా అభివృద్ధికి ఇస్తే పోటీ నుంచే తప్పుకుంటామని, అందుకు సిద్ధమేనా? అని ఛాలెంజ్ చేశారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలను, నేతలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. శివన్నగూడెం నిర్వాసితులకు న్యాయం జరగాలని, వారి తరఫున ఉండి కొట్లాడతామని, తమకు ఒక్కసారి అవకాశం ఇచ్చి స్రవంతిని గెలిపించాలని శివన్నగూడెంలో జరిగిన రోడ్‌షోలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి తరలివస్తున్న నోట్ల కట్టలు మునుగోడులో భారీగా డబ్బు కుమ్మరించేందుకు రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లుగా నియోజకవర్గంలో, మండలాలు, గ్రామాల్లో ప్రభావం చూపగలిగే నాయకులు, ఓటర్లకు ఎర వేసి చేరికలను జోరుగా చేరికలను ప్రోత్సహిస్తున్న పార్టీలు ఇప్పుడు ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. పొద్దంతా ప్రచారం కొనసాగిసూ్తనే పగలు వీలు చిక్కినప్పుడు, రాత్రంతా మంతనాలు సాగిస్తున్నాయి. వారికి మట్టుజెప్పేందుకు అవసరమైన డబ్బును నియోజకవర్గానికి తరలిస్తున్నట్లు తెలిసింది. నలుగురు సభ్యులు ఉన్న ఒక్కో కుటుంబానికి రూ. 40 వేలు ఇస్తామని ఇంటి యజమానులను, బంగారం ఇస్తామంటూ మహిళలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
రాజగోపాల్‌రెడ్డి ఆస్తుల విలువ.. రూ.274 కోట్లు
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఆస్తులు, అప్పులతో పాటు పోలీస్ కేసుల వివరాలతో కూడిన ఎన్నికల అఫిడవిట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సోమవారం ఆయన చండూరులో నామినేషన్ వేశారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారంగా ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి పేరుపైన ఉన్న ఆస్తుల విలువ రూ.152 కోట్ల 69లక్షల 94వేలు కాగా, ఆయన భార్య లక్ష్మి పేరున రూ.48,55,25,250 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వ్యవసాయ భూములు, రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, హైదరాబాద్‌లో ప్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.69,97,70,142, ఆయన భార్య పేరుపైన రూ.3,89,63,167 విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.274 కోట్లు. బ్యాంకులో అప్పు రూ.61,84,80,220 ఉన్నట్లు చూపారు. కాగా, 2014లో మునుగోడు నుంచే పోటీ చేసినప్పుడు రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్తిరాస్తుల విలువ రూ.47కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.265 కోట్లు ఉంది. అదేవిధంగా 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.198 కోట్లుగా ఆఫిడవిట్లో పేర్కొన్నారు. స్రవంతి ఆస్తుల విలువ రూ.40 కోట్లు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్బంగా రిటర్నింగ్ అధికారికి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం స్రవంతి పేరుపైన రూ.25,71,52,390 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. ఆమె భర్త పేరుపై రూ.15,13,25,804 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు లెక్కలు చూపించారు. బ్యాంకులో స్రవంతి పేరున రూ.6 లక్షలు, భర్త పేరున రూ.55 లక్షల అప్పులు చూపించారు. -
ఉద్యోగం మానేసి మరీ ప్రియుడికి దగ్గరైన సారిక..
నమ్మి ఇంటికి పిలిచిన స్నేహితుడు ఆ బంధానికే మచ్చతెచ్చాడు. స్నేహితుడు భార్యతో చనువు పెంచుకుని ఆమెకు దగ్గరయ్యాడు.. కుటుంబంలో కలతలు సృష్టించి దంపతులను వేరు చేశాడు.. తమ ఇద్దరి సఖ్యతకు అడ్డుగా ఉన్నాడని పక్కా ప్రణాళిక రచించి చివరకు భార్యతోనే స్నేహితుడిని హత్య చేయించాడు. నల్గొండ (శాలిగౌరారం) : శాలిగౌరారం మండలం చిత్తలూరులో ఇటీవల వెలుగుచూసిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దారుణానికి తెగబడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నకిరేకల్‌లోని శాలిగౌరారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి కేసు వివరాలను వివరించారు. నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్(29)కు మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన మామిడికాయల సారికతో 2011లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు(10), కుమార్తె(7) ఉన్నారు. వివాహం జరిగిన తర్వాతా కొన్నేళ్లపాటూ మండలాపురంలో జీవించిన కిరణ్–సారిక దంపతులు 2015లో బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. అక్కడే ఎన్టీఆర్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. సారిక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో సారిక భర్త మాచర్ల కిరణ్‌కు హాస్పిటల్స్‌లో హౌస్‌కీపింగ్ పనులు కాంట్రాక్ట్ పట్టే యాదాద్రిభువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన రొడ్డ మల్లేష్‌తో పరిచయం ఏర్పడింది. స్నేహితుడి భార్యతో చనువు పెంచుకుని.. దీంతో మల్లేష్ తరచూ కిరణ్ ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలోనే మల్లేష్ స్నేహితుడి భార్య అయిన సారికతో చనువు పెంచుకుని సఖ్యతగా మెలుగుతున్నాడు. కొద్ది రోజుల తర్వాత సారిక వ్యవహారశైలిని గుర్తించిన కిరణ్ నిలదీశాడు. దీంతో దంపతుల మధ్య పెరిగిన గొడవలు పెద్ద మనుషుల వద్దకు వెళ్లాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా భార్యాభర్తలకు సర్దిచెప్పి పంపించారు. ఇంటికి పిలిచి.. బండరాయితో మోది.. మల్లేష్ ప్రణాళిక రచించి సారికను అమలు చేయాలని ప్రోత్సహించాడు. అందులో భాగంగానే సారిక తనభర్త కిరణ్‌ను ఈనెల 20న చిత్తలూరుకు పిలిపించుకొని సపర్యలు చేసింది. అతడికి మద్యం తాగించి ఇంట్లో నేలపై పడుకోబెట్టింది. నిద్రలోకి జారుకున్న భర్త తలపై బునాది బండరాయితో రెండుమార్లు బలంగా మోది(కొట్టి) హత్య చేసింది. అనంతరం భర్తను చంపిన విషయాన్ని ఫోన్లో ప్రియుడు రొడ్డ మల్లేష్‌కు చెప్పి సూర్యాపేట జిల్లా అర్వపల్లి వైపు పారిపోయింది. ఈనేపధ్యంలో మృతుడి తమ్ముడు మాచర్ల కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శాలిగౌరారం సీఐ రాఘవరావు ఎస్ఐ సతీష్ బృందం దర్యాప్తు చేపట్టారు. నిందితులు అర్వపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న విషయం తెలుసుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ రాఘవరావు, ఎస్ఐ సతీష్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఉద్యోగం మానేసి మరింత దగ్గరై.. సారిక హాస్పిటల్ ఉద్యోగం ఇబ్బందిగా ఉందని మానేసి మల్లేష్ వద్ద హౌస్‌కీపింగ్ సూపర్వైజర్గా పనిలో కుదిరింది. దీంతో వారిద్దరి మధ్య మరింత చనువు పెరిగింది. ఈ విషయం కిరణ్‌కు తెలియడంతో మళ్లీ దంపతులు గొడవపడ్డారు. దీంతో సారిక అలిగి ఆరు మాసాల క్రితం పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. కాగా, ఈ క్రమంలో మల్లేష్ భార్య నెలరోజుల క్రితం అదృశ్యమైంది. అందుకు కిరణ్ కారణమని భావించి అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని సారికతో ఫోన్లో చెప్పాడు. దీంతో సారిక కూడా తనభర్త కిరణ్ నుంచి తనకు వేధింపులు ఎక్కువ అయ్యాయని వాపోయింది. దీంతో కిరణ్ ను హత్య చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. -
హోలీ పండుగకు భార్య మటన్ వండలేదని 100కు కాల్..
నల్గొండ (కనగల్) : భార్య మటన్ వండలేదని ఓ వ్యక్తి 100కు కాల్ చేసి కేసుల పాలయ్యాడు. ఎస్ఐ యు. నగేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .. నల్లగొండ జిల్లా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన ఓర్సు నవీన్ తన భార్య మటన్ వండలేదని డయల్ 100కు ఆరు సార్లు కాల్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు అనవసరంగా కాల్ చేసి ఇలా పోలీసుల సమయాన్ని వృథా చేయడంతో కేసు నమోదు చేశారు. ఆపద, అత్యవసర సేవలకోసం మాత్రమే డయల్ 100కు పోన్ చేయాలని ఎస్ఐ సూచించారు. -
పురోహితుడికి గ్రామానికి గ్రామమే దానం
సాక్షి, హైదరాబాద్: పురోహితుల కోసం ప్రత్యేకంగా అగ్రహారాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ, రాజ పురోహితులకు గ్రామం మొత్తాన్ని దానంగా సమర్పించిన ఉదంతాలు అరుదు. అలాంటి ఓ దాన శాసనం తాజాగా వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలంలోని వావికొల్లు గ్రామం పొలిమేరలోని చారగొండవాగు తీరంలోని పొలాల్లో స్థానిక యువకుడు దీనిని గుర్తించాడు. దాన్ని తగుళ్ల గోపాల్ అనే కవి తన దృష్టికి తెచ్చారని, ఏడడుగుల ఎత్తు అడుగున్నర మందంతో ఉన్న ఈ శిలపై నాలుగు వైపులా 81 పంక్తులలో తెలుగులో చెక్కిన శాసనం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. చదవండి: మణికొండ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి బాధ్యత వహిస్తాం: మంత్రి కేటీఆర్ కళ్యాణీ చాళుక్యుల చక్రవర్తి త్రిభువన మల్లదేవ రెండో జగదేకమల్ల పాలనా కాలంలో, పానగల్లు రాజధానిగా కందూరు నాడును పాలించిన సామంతుడైన ఉదయనచోడ మహారాజు ఈ శాసనాన్ని వేయించారని హరగోపాల్ పేర్కొన్నారు. క్రీ.శ.1158 ఆగస్టు 10న బోడవిప్పఱ్రు అనే గ్రామాన్ని దానం చేసినట్టు, బహుధాన్య నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమినాడు చంద్రగ్రహణ ప్రత్యేక వేళ ఈ దానాన్ని సమర్పించినట్టు తెలుస్తోందని చెప్పారు. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు గ్రామం నుంచి వసూలయ్యే పన్నులు రాజ్యానికి సమర్పించాల్సిన అవసరం లేకుండా, ఆ రాజ పురోహితులే అనుభవించేలా అవకాశం కల్పించారు. పుర హితానికి తోడ్పాటునందించే పురోహితులకు ఇలా దానాలు సమర్పించటం అప్పట్లో ఆనవాయితీగా ఉండేదని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. ఉదయనచోడుడి పాలన 1158 వరకు కొనసాగిందన్న ఆధారాన్ని చూపిన శాసనమిది కావటం విశేషం. గతంలో ఇదే రాజు వేయించిన 1157 నాటి శాసనం భువనగిరి సమీపంలో లభించింది. -
ఒకరు అదృశ్యం.. మరొకరు అమ్మకానికి!
డిండి: కళ్లు తెరిచి నెలరోజులు గడిచిందో లేదో.. అప్పుడే అమ్మఒడి నుంచి ఓ ఆడశిశువు అదృశ్యమైంది.. దీనిపై తల్లిదండ్రులు నోరువిప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోఘటనలో ఏడురోజుల పసిగుడ్డును అమ్మకానికి పెట్టారు ఓ పేద తల్లిదండ్రులు. ఇదేమిటని ప్రశ్నించిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలు ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివరాలు... డిండి మండలం కుందేలుబాయితండా గ్రామ పంచాయతీ పరిధిలోని శ్యామలబాయితండాకు చెందిన జర్పుల çరమేశ్, సంగీత దంపతులు. వీరికి జూన్ 28న రెండో సంతానంగా ఆడశిశువు జన్మించింది. కాన్పు అనంతరం కాటికబండతండాలోని తల్లిగారింటికి వెళ్లిన సంగీత వారం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చింది. అయితే శిశువు పేరు రిజిస్టర్లో నమోదు చేయడానికి వెళ్లిన అంగన్వాడీ టీచర్‌కు ఆ శిశువు కనిపించలేదు. శిశువు గురించి అడిగితే తల్లిదండ్రుల్లో ఉలుకూపలుకూలేదు. అదే శ్యామలబాయి తండాకు చెందిన ఇస్లావత్ సక్రూ భార్య అమృత గతనెల 24న మూడో కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాపను ఇతరులకు అమ్ముకుంటున్నారని చైల్డ్ హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్ 1098కు ఓ కాల్ వచ్చింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు, డిండి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గతనెల 30, 31 తేదీల్లో ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. శిశువులు తల్లిదండ్రుల వద్దే ఉండాలని, లేనిపక్షంలో ఐసీడీఎస్ గృహానికి అప్పగించాలని, అక్రమంగా దత్తత ఇవ్వకూడదని సూచించారు. అయినా తమ బిడ్డను అమ్ముకుంటామని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమీలేక ఆ ఇద్దరు శిశువుల వివరాలు సేకరించాలని కోరుతూ అంగన్వాడీ సూపర్వైజర్ రేణుకారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపుతా
సాక్షి, నాగోలు: నకిలీ ఇన్స్టాగ్రామ్ సృష్టించి యువతికి పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతూ మెసేజ్‌లు చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, 6 సిమ్ కార్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన చపాల ప్రవీణ్(22) గ్రామంలో మగ్గం వర్క్ చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన చేనేత కార్మికుడి ఇంట్లో ఉండే అమ్మమ్మ దగ్గర యువతి నివాసం ఉండేది. ప్రవీణ్‌తో యువతికి పరిచయం ఏర్పడింది. దీంతో అతను యువతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు యువతి వ్యక్తిగత కారణాల వల్ల అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. తర్వాత ఆమె తన సొంత గ్రామానికి వెళ్లి పోయింది. అప్పటి నుంచి అతడిని నిర్లక్ష్యం చేయడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమె వద్ద సానుభూతి కోసం ఒక నకిలీ ఇన్‌స్ట్రాగామ్ ఐడిని సృష్టించి బాధితురాలికి ఫ్రైండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె ఓకే చేసింది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపుతానని యువతిని బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలను సేకరించి శుక్రవారం ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ సీఐ బి.ప్రకాష్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో బాలికలు, మహిళలు అపరిచితుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని సూచించారు. చదవండి: శ్మశానవాటికలో నిప్పంటించుకుని.. -
ఆక్సిజన్ అందక బాధితుడి మృతి
-
అటవీ అధికారులపై దాడి..
సాక్షి, నల్గొండ: అటవీ రాళ్ల తరలింపును అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై స్థానికులు దాడికి దిగిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం పంచాయతీ పరిధిలో రెండు ట్రాక్టర్లలో అటవీ రాళ్లను తరలిస్తుండగా అటవీ అధికారులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి ఫారెస్ట్ కార్యాలయానికి తరలిస్తుండగా అధికారులపై సుమారు 15 మంది స్థానికులు కర్రలు,రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు అధికారులు గాయపడ్డారు. వారిని వైద్య చికిత్స కోసం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అడవిదేవులపల్లి పోలీస్‌స్టేషన్‌లో అటవీ అధికారులు ఫిర్యాదు చేశారు. -
‘ఫార్మా సిటీతో హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం’
ఢిల్లీ: హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు. సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు అంశాలపై ప్రధానికి విజ్ఞాపన పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. మొదట మూడు వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తామన్న ఫార్మా సిటీని 19,333 ఎకరాలకు పెంచారన్నారు. ఫార్మా సిటీ వల్ల హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం ఉంటుందని తెలిపారు. ఎయిర్ పోర్టు దగ్గరలో ఫార్మా సిటీ రానివ్వమని ఆయన అన్నారు. మరొకచోట ఏర్పాటు చేయాలన సూచించినట్లు తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త గూడెం వరకు జాతీయ రహదారిగా గుర్తించాలని ప్రధాని మోదీని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అదేవిధంగా కాపర్,జింక్, ఇతర విష పదార్థాలు మూసినది నీటిలో మోతాదుకు మించి కలుస్తున్నాయని కోమటిరెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. దాంతోపాటు మూసినది శుధ్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని కోమటిరెడ్డి ప్రధానిని కోరారు. అదేవిధంగా సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద భువనగిరి పార్లమెంట్ పరిధిలో బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. తన విజ్ఞప్తులకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి తెలిపారు. ఇంటింటికీ నీరు ఇంకా అందడం లేదన్నారు. హౌసింగ్ పథకాన్ని కేంద్రమే చేపట్టాలని కోమటిరెడ్డి ప్రధాని దృషష్టికి తీసుకు వెళ్లినట్లు కోమటిరెడ్డి వివరించారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గౌరెల్లి జంక్షన్-కొత్తగూడెం జాతీయ రహదారికి నెంబరింగ్ ఇవవ్వాలని కోమటిరెడడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు.వలిగొండ, పోచంపల్లి, తిరుమలగిరి, తొర్రురు, నెల్లికుదురు, మహబూబద్, ఇల్లందు మీదుగా హైద్రాబాద్-కొత్త గూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన పార్లమెంట్ పరిధిలో ఈ జాతీయ రహదారి వంద కిలోమీటర్లు ఉంటుందని ఆయన తెలిపారు. 2016లొనే డీపీఆర్ సిద్ధం చేశారని.. నేటికి పనులు మొదలు కాలేదన్నారు. 2019లో ఈ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పటి వరకు నెంబరింగ్ ఇవ్వలేదన్నారు. అప్ గ్రెడెషన్ పనులను త్వరగా ప్రారంభించాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. డీపీఆర్ సిద్ధంగా ఉందని.. ఆమోదించి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు మీడియాకు తెలిపారు. మారుమూల గిరిజన తండాలు, భద్రాచలం దేవస్థానం ఉన్న రహదారి పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి లేఖను ప్రధాని మోదీకి అందజేసినటట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. -
హుజూర్నగర్ ఉప ఎన్నికపై అంతర్గత సర్వే
సాక్షి, హైదరాబాద్: ప్రజల స్పందన టీఆర్ఎస్కు అనుకూలంగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై పార్టీ ఇంచార్జీలతో పాటు, పలువురు సీనియర్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపఎన్నికలు సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్ర సమితి.. కాంగ్రెస్ కన్నా చాలా ముందు వరుసలో ఉందని కేటీఆర్ అన్నారు. 50 శాతం ఓట్లు టీఆర్ఎస్కే.. కనీసం 50 శాతం ఓట్లు టీఆర్ఎస్కే వస్తాయని తమ అంతర్గత సర్వేలో తేలిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం సంతృప్తిగా ఉందని, రానున్న వారం రోజుల్లో మరింత ప్రణాళికాబద్ధంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వలన టీఆర్ఎస్ ఓడిపోయిందని, ఈసారి కూడా అలాంటి కొన్ని వాహనాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని.. కారు గుర్తుని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు డమ్మీ ఈవీఎంలను ఉపయోగించుకోవాలని కోరారు. టీఆర్ఎస్కు వివిధ సామాజిక వర్గాల నుంచి మద్దతు అద్భుతంగా వస్తుందన్నారు. ఏం చెప్పాల్లో కాంగ్రెస్‌కు తెలియడం లేదు.. ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాలో కాంగ్రెస్‌కు తెలియడం లేదన్నారు. మరోవైపు ‘టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్నగర్ కి లాభం.. కారు గుర్తుకు ఓటేస్తే హుజూర్ నగర్ అభివృద్ధి బాట’ పడుతుందంటూ తాము చేస్తున్న ప్రచారానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిధులతో హుజూర్‌నగర్‌ను అభివృద్ధి చేస్తామంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, కానీ కేంద్ర, రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ అధికారంలో లేదన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కి ఓటేస్తే హుజూర్నగర్ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఈ ఉప ఎన్నికలతో బీజేపీ బలం ఎంతో తేలిపోతుందని, ఇన్నాళ్లుగా వారి మాటలు, వట్టి మూటలని తేలిపోతుందని కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటే అదే వారికి గొప్ప ఉపశమనం అన్నారు. తమకు ఎలాగూ ప్రజల్లో బలం లేదని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి పరోక్షంగా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీల దొంగచాటు బంధాన్ని ప్రజల్లో ఎండగట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ ఇంచార్జీలకు సూచించారు. -
ఆ గ్రామానికి మెదటి సర్పంచ్‌గా..
కట్టంగూర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కట్టంగూర్ మండలంలో 22 జీపీలకు నూతనంగా ఏర్పడిన రామచంద్రాపురం గ్రామం ఏకగ్రీవం అయ్యింది. రామచంద్రాపురం గ్రామానికి మెదటి సర్పంచ్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి సూరారపు ప్రియాంకగణేశ్ ఎన్నికకావడం పట్ల ఆ గ్రామ ప్రజలు, వైస్‌ఎంపీపీ బొడ్డుపల్లి జానయ్య శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈనెల 30న 22 జీపీలకు గాను 21 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉపసంహరణల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మండలంలోని 22 జీపీలకు 121 మంది సర్పంచ్‌లు నామినేషన్ వేయగా 57 మంది ఉపసంహరించుకోవడంతో 64 మంది బరిలో ఉన్నారు. 206 వార్డులకు గాను 631 నామినేషన్లు వేయగా 158 మంది ఉపసంహరించుకోగా 473 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. రామచంద్రాపురం గ్రామంలో 8 వార్డులు సభ్యులు నందికొండ పార్వతమ్మ, రేకల చందన, సూరారపు మహేందర్, మహేశ్వరం మహేందర్, బొడ్డుపల్లి రేణుక, నీలం గణేశ్, అనంతుల సురేశ్, బోయపల్లి పద్మ, మల్లారం గ్రామంలో 5 వార్డులు, కట్టంగూర్ గ్రామంలో 13వ వార్డు సభ్యులు నిమ్మల యాదయ్య, గార్లబాయిగూడెం గ్రామంలో 6వ వార్డు, నల్లగుంటబోలు గ్రామంలో 6 వార్డులు చొప్పున మొత్తం 21 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. బరిలో ఉన్న సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడిక్కింది. -
నల్గొండలో ఒక్కరోజే రూ.3 కోట్లు తాగేశారు
నల్లగొండ క్రైం : కొత్త సంవత్సర వేడుకల్లో మద్యం పొంగింది. మందు ప్రియుల జేబుకు చిల్లు పడగా.. ఆబ్కారీ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. నూతన సంవత్సర వేడుకలకు స్వాగతం పలికేందుకు జరిగిన కార్యక్రమాలతో ఒక్క రోజులోనే (డిసెంబరు 31వ ) రూ.3 కోట్ల మద్యం సేల్ అయ్యింది.ఇక, డిసెంబరు నెల విషయానికి వస్తే.. 2017 డిసెంబర్ ఒక్క నెలలో రూ.83 కోట్ల 2లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా, 2018 డిసెంబర్లో రూ.95 కోట్ల 28 లక్షల విలువ గల మద్యం అమ్మకాలు జరిగాయి. 2017తో పోలిస్తే 2018 డిసెంబర్లో రూ.12.26 కోట్ల అదనపు అమ్మకాలు జరిగాయి కేవలం డిసెంబర్ 31 నాడు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల 15 లక్షల విలువైన మద్యం వైన్‌షాపులకు చేరగా... అందులో రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 138 వైన్‌షాపులు, 18 బార్లు, నాగార్జునసాగర్, నల్లగొండల్లో క్లబ్బులు ఉన్నాయి. డిసెంబర్ 31న మద్యం డిపో నుంచి వైన్‌షాపులకు 8,185 లిక్కర్ పెట్టెలు, 10,298 బీర్ పెట్టెలు తరలాయి. మొత్తం రూ. 5,15 లక్షల విలువైన మద్యం వైన్‌షాపులకు చేరగా రూ.3 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రోజుకు సగటున రూ.2 కోట్ల 50 లక్షల మద్యం అమ్మకం ఉంటుందని జిల్లా ఎక్సైజ్ అధికారి శంకరయ్య తెలిపారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత బీర్లను పొంగించారని మద్యం అమ్మకాలు రుజువు చేస్తున్నాయి. -
నాభర్తపై టీఆర్ఎస్ కక్ష కట్టింది : సబిత
నల్లగొండ : తన భర్త కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టిందని మాజీ మంత్రి, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి సబిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని 9, 21వ వార్డుల్లో ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా తన భర్త తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించేందుకు నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కోమటిరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా కక్షకట్టి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రజలు ప్రశాంతంగా ఎలాంటి అల్లర్లు లేకుండా ఉండాలంటే కోమటిరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆమెవెంట బుర్రి శ్రీని వాస్‌రెడ్డి, శ్వేత, బుర్రి చైతన్య, సరస్వతి, నాగమణి, సరోజ, సరిత, శ్రీలత, పల్లె రవీందర్‌రెడ్డి, గాడిగ శ్రీనివాస్, గాదె శ్రీనివాస్‌రెడ్డి, వంగాల అనిల్‌రెడ్డి, లింగస్వామి, జానయ్య, సోమయ్య, నాగరాజు,వెంకటేశ్వర్లు,రవి తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్లో.. బీ–ఫారాల సందడి
సాక్షి,నల్లగొండ: ముందస్తు ఎన్నికలు ఖరారైన రోజే తమ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒకరోజు ముందే బీ–ఫారాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6న ప్రభుత్వం రద్దు కావడం, ఆ వెంటనే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. రెండు నెలలుగా టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను పది చోట్ల టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా, కోదాడ, హుజూర్నగర్ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు విపక్ష కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు ఇంకా టికెట్ల కసరత్తు దగ్గరే ఆగిపోగా.. టీఆర్ఎస్ మాత్రం తమ అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చే పనిలో పడింది. ఉమ్మడి జిల్లాలోని పది మంది అభ్యర్థులు ఆదివారం టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఆయన ముందుగానే బీ–ఫారాలు అందిస్తారని చెబుతున్నారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగానే బీ–ఫారాలు ఇవ్వనుండడంతో, అభ్యర్థులు సైతం నామినేషన్లు వేయడానికి ముహూర్తాలు చూసుకునే పనిలో పడ్డారు. ఇతర పార్టీల వారి కంటే ముందుగానే నామినేషన్లు దాఖలు చేసి మరింతగా ప్రచారంపై దృష్టి పెట్టాలన్న నిర్ణయం మేరకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండు నెలలుగా నియోజకవర్గాల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రచారం చేపట్టిన టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు తర్వాత రెండో విడత ప్రచారం కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. అధినేతతో ప్రత్యేక భేటీ! టీఆర్ఎస్ అభ్యర్థులతో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే ఒకసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీ–ఫారాలు అందించేందుకంటూ ఏర్పాటు చేస్తున్న రెండో భేటీలో సైతం వివిధ అంశాలను ఆయన సమీక్షిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రెండు నెలలుగా నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభ్యర్థుల ప్రచారం తీరు తెన్నులను తెలుసుకుంటూ, వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించారు. అవసరమైన ప్రతి అభ్యర్థితో కేసీఆర్ నేరుగా ఫోన్లో మాట్లాడుతూ ప్రచారానికి మార్గదర్శకం వహించారు. గత నెల నాలుగో తేదీన నల్లగొండ పట్టణంలో ఉమ్మడి జిల్లా స్థాయి బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయా స్థానాలకు ప్రచార సామగ్రిని పంపించడంతోపాటు రోజు వారీగా ప్రచార సరళిని పరిశీలించి విశ్లేషిస్తూ అవసరమైన సూచనలు చేశారు. అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు గడిచిపోవడంతోపాటు, ఎన్నికల్లో అసలైన అంకం మొదలు కావడంతో నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోలింగ్ వరకు మిగిలిన ఉన్న ఈ కాలంలో అభ్యర్థులు ఏమేం చేయాలన్న అంశాలపై చర్చిం చనున్నారని చెబుతున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం, ఆ తర్వాత ఆయా నియోజవకర్గాల్లో తలెత్తిన అసమ్మతి వ్యవహారాలకు నెల రోజుల్లోపే చెక్ పెట్టడంతో మిగిలిన నెల రోజుల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో వారు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక, నోటిఫికేషన్ విడుదల తర్వాత అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చిస్తారని అంటున్నారు. ప్రచార సభలపై రానున్న స్పష్టత మరోవైపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బహిరంగ సభల్లో పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక బహిరంగ సభను నల్లగొండలో నిర్వహించగా కేసీఆర్ పాల్గొన్నారు. అక్టోబరు నెలాఖరులో జిల్లాలోని నకిరేకల్, ఆలేరు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగ సభలు ఉంటాయని పార్టీ వర్గాలు భావించినా అవి జరగలేదు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత .. ఆయన జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారని పేర్కొంటున్నారు. దీంతో ఆదివారం నాటి కేసీఆర్ సమావేశం తర్వాత ప్రచార సభలు, నిర్వహించే తేదీలపై ఒక స్పష్టత రానుందని అంటున్నారు. అదే మాదిరిగా, ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న కోదాడ, హుజూర్నగర్లపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరించాయి. -
వీడని సస్పెన్స్!
సాక్షి,నల్లగొండ: ఇంకెప్పుడు..? సోమవారం నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తరు..? వారెప్పుడు ప్రచారం చేసుకుంటరు..? ఇంకా పొత్తులు ఏమయ్యాయి, అభ్యర్థులు తేలక గందగోళమేంది..? ఆదివారమైనా అభ్యర్థులను ప్రకటిస్తరా .. లేదా..?’ .. అన్న చర్చ సగటు కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. రోజుకో తీరున మారుతున్న కూటమి పొత్తులు చివరకు ఎవరికి నిరాశను మిగులుస్తాయో అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నలుగురు సిట్టింగ్ అభ్యర్థులకు దాదాపు టికెట్లు ఖరారు అయినట్లే. అవి అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉంది. కోదాడ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నా.. అక్కడ సిట్టింగ్ తిరిగి బరిలో ఉంటారన్న అభిప్రాయానికి కాంగ్రెస్ వర్గాలు వచ్చాయి. మరో వైపు ఆలేరు, భువనగిరి విషయంలోనూ ఎలాంటి సందేహాలు లేవని అంటున్నారు. అంటే.. ఆరు స్థానాల్లో స్పష్టత ఉన్నా.. మరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్‌నుంచి ఎవరు పోటీచేస్తారు..? సీపీఐకి ఏ స్థానం ఇస్తారు..? టీడీపీ అ డుగుతున్న స్థానాల మాటేమిటీ..? ఇంటి పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? తెలంగాణ జన సమితికి జిల్లాలో స్థానం కల్పిస్తారా.. అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అటు కాంగ్రెస్‌ను, ఇటు మహా కూటమి భాగస్వామ్య పక్షాలను ఆలోచనలో పడేస్తున్నాయి. తొలుత శుక్రవారం అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పినా, అది శనివా రం నాటికి వాయిదా పడింది. చివరకు శనివారం కూడా అలాంటి ప్రకటనేదీ వెలువడక పోవడంతో కనీసం ఆదివారమైనా ప్రకటిస్తారేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆదివా రం మెజారిటీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఎందరికి తొలి జాబితా లో చోటు దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది.కొనసాగుతున్న ఉత్కంఠ ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ పడాలని, టికెట్లు కోరిన ఆశావహుల పేర్లను వడబోసిన కాంగ్రెస్ నాయకత్వం తొలి విడతలో 75 మంది తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందని, అందులో జిల్లాలో కచ్చితంగా ఆరు పేర్లు అయినా ఉంటాయని భావించారు. రెండో జాబితాలో మిగిలిన స్థానాల్లో మహా కూటమి అభ్యర్థులతో కలిపి పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారన్న వార్తలూ వెలువడ్డాయి. దీంతో గడిచిన రెండు రోజులుగా టికెట్ల ప్రకటన కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు ఆశావహుల సంఖ్యను తగ్గించేందుకు ఏయే నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారో..? ఏ నియోజకవర్గంలో పరిస్థితి కొంత సమస్యాత్మకంగా ఉందని భావించారో ఆయా స్థానాల నుంచి ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లేనని భావించి ప్రకటన కోసం ఎదురు చూసినా.. ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక తాజా రాజకీయాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఇంకా.. టికెట్ల ప్రకటనపై సస్పెన్స్ కొనసాగుతుండడంపై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తుల .. కిరికిరి! మరోవైపు జిల్లాలో మహా కూటమిలోని నాలుగు భాగస్వామ్య పక్షాలు టికెట్లు ఆశిస్తున్నాయి. టీడీపీ, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జనసమితి ఈ రేసులో ఉన్నాయి. కాంగ్రెస్‌కు నల్లగొండ, నాగార్జున సాగర్, హుజూర్నగర్, కోదాడలలో సిట్టింగ్‌లు ఉన్నారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టికెట్ పోటీదారులు లేరు. దీంతో అక్కడా అభ్యర్థుల ప్రకటనకు అడ్డంకులు లేవని భావించినా, సీపీఐ ఆలేరును కోరుతోంది. మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడెం, తుంగతుర్తి, నకిరేకల్.. ఈ అయిదు స్థానాల్లో అటు కాంగ్రెస్‌లో టికెట్లకు పోటీ ఉండడంతోపాటు, కూటమి భాగస్వామ్య పక్షాలు కోరుతున్న స్థానాలూ ఇవే కావడం, సూర్యాపేటలో ఇద్దరు నేతలు టికెట్ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తుండడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. నకిరేకల్ సీటు వ్యవహారం ఒకింత వివాదాస్పదమైంది. ఈ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా ఇంటి పార్టీకి ఇస్తున్నారని జరిగిన ప్రచారంతో కాంగ్రెస్ నేతలు అడ్డం తిరిగారు. మునుగోడును కాంగ్రెస్‌తో పాటు సీపీఐ బలంగా కోరుకుంటోంది. టీడీపీ కోదాడ, లేదంటే నకిరేకల్ ఇవ్వాలంటోందని చెబుతున్నారు. టీజేఎస్ మిర్యాలగూడపై కన్నేసింది. దీంతో పొత్తుల కిరికిరి అభ్యర్థుల ప్రకటనను మరింత జఠిలం చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రజల మనసు గెలుచుకున్న ప్రభుత్వ డాక్టర్
-
91.39 కోట్లు..
ఇదీ.. జిల్లా విద్యాభివృద్ధి ప్రణాళిక వ్యయం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకే తొలి ప్రాధాన్యం ప్రభుత్వ నిధులు, ప్రజాప్రతినిధుల వాటా, క్రూషియల్ నిధులతో కలిపి ఏడాదికి రూ.30 కోట్లు సమీకరణ నేడు సీఎం కేసీఆర్ వద్దకు విద్యాప్రణాళిక నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా సర్కారు బడులు అన్ని రకాల హంగులతో తీర్చిదిద్దాలంటే నికరంగా కావాల్సింది రూ.91.39 కోట్లు.. ఈ మొత్తం నిధులు విద్యాభివృద్ధికి కేటాయిస్తే తప్ప.. ప్రస్తుతం పాఠశాలల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదు. పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ సూచనల మేరకు జిల్లా విద్యాశాఖ అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సమీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ బుధవారం నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో విద్యాప్రణాళికను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు స్థానిక అధికార యంత్రాంగం జిల్లాల పునర్విభజన తర్వాత నల్లగొండకు చెందిన 31 మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ప్రకారంగా ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.91.39 కోట్లతో రూపొందించిన ప్రణాళికలో ప్రధానంగా నాలుగైదు అంశాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రాధాన్యత అంశాలు శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను పూర్తిగా తొలగించి కొత్త భవనాలు నిర్మించడంతో పాటు అవసరైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణం పాఠశాలలో మరుగుదొడ్ల ఏర్పాటు మరుగుదొడ్లలో నీటి వసతి.. తాగునీటి సౌకర్యం.. విద్యుత్ సౌకర్యం, సామగ్రి సమకూర్చుకోవడం.. ప్రణాళిక ఇదీ.... జిల్లాల పునర్విభజన తర్వాత నల్లగొండలో మొత్తం 1478 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 1,120, ప్రాథమికోన్నత 131, హైస్కూళ్లు 227. వీటిలో తరగతి గదులు లేని ప్రాథమిక పాఠశాలలు 243, యూపీఎస్‌లు 37, హైస్కూళ్లు 83 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పాఠశాలలకు తరగతి గదులు నిర్మించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఒక్కో తరగతి గదికి రూ.7.40 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో నిర్మించే తరగతి గదికి రూ .8.75 లక్షలు ఖర్చువుతాయని అంచనా వేశారు. మరుగుదొడ్లులేని పీఎస్‌లు–13, యూపీఎస్–1, ఉన్నత పాఠశాలలు–120 ఉన్నాయి. వీటిలో మరుగుదొడ్ల నిర్మించేందుకు ఒక్కో దానికి రూ.1.95 లక్షల చొప్పున అవసరమని అంచనాలు రూపొందించారు. నీటి వసతి లేకుండా మరుగుదొడ్లు మాత్రమే ఉన్న పీఎస్‌లు–622, యూపీఎస్‌లు–61, ఉన్నత పాఠశాలలు –72 ఉన్నాయి. ఈ మేరకుఒక్కో పాఠశాలల కు రూ.1.35 లక్షల చొప్పున అంచనా వేశారు. విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలు పీఎస్‌లు– 140, యూపీఎస్‌లు–11, ఉన్నత పాఠశాలలు–8 ఉన్నాయి. ఒక్కో పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలంటే రూ.35 వేలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. l1478 పాఠశాలల్లో ఫర్నిచర్ లేదు. విద్యార్థులు తేలిగ్గా చదువుకునేందుకు, పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డ్యూయల్ డెస్క్‌లు అవసరం. 1478 పాఠశా లల్లో 46,076 డ్యూయల్ డెస్క్‌లు అవసరమని ప్రణాళికలో పేర్కొన్నారు. ఒక్కో పాఠశాలలో డ్యూయల్ డెస్క్‌కు అయ్యే అంచనా వ్యయం రూ.45 వేలుగా నిర్ణయించారు. ప్రహరీలు లేని పీఎస్‌లు–443, యూపీఎస్‌లు– 20, ఉన్నత పాఠశాలలు–33 ఉన్నాయి. ఒక్కో ప్రహరిగోడ నిర్మాణానికి రూ.5.70 లక్షల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఒక్క హై స్కూల్లో మాత్రమే గ్రంథాలయం లేదు. దీనికి రూ.25 వేలు కావాలని ప్రణాళికలో పేర్కొన్నారు. సైన్స్ ల్యాబ్‌లు లేని ఉన్నత పాఠశాలలు 166 ఉన్నాయి. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున అవసరమవుతాయని అంచనాలు రూపొందించారు. నిధుల సమీకరణ.. రూ.91 కోట్ల ప్రణాళిక ఆచరణలోకి రావాలంటే జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న ఆర్ధిక వనరులను కూడా ప్రణాళికల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.కోటి, కలెక్టర్ లేదా ఇన్చార్జి మంత్రి క్రూషియల్ నిధుల నుంచి నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున కేటాయిస్తే.. ప్రభుత్వం తన వాటా కింద నియోజకవర్గానికి రూ.3 కోట్లు విడుదల చేస్తుంది. ఈ లెక్కన నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు ఒక్కోదానికి రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి రూ.30 కోట్లు నిధులు సమీకరించుకోవ చ్చని తెలిపారు. ఇప్పటివరకు నాగార్జునసాగర్, దేవరకొండ ఎమ్మెల్యేలు, ఎంపీ గుత్తా మాత్రమే తమ కోటా నిధులు పాఠశాలల అభివృద్ధికి కేటాయించారు. సాంకేతిక వైపు అడుగులు.. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం కలిగించేలా, విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని.. ముందుగా మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని అధికారులు తెలిపారు. ఇవన్నీ లేకుండా పాఠశాలల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. డిజిటల్ విద్యాబోధన అమలు, ప్రభుత్వ పాఠశాలల్లోనే పదో తరగతి పరీక్షల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు ప్రవేశపెట్టాలని నిర్ణయించిన దాని ప్రకారం ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలంటే ఉనికి కోల్పోతున్న సర్కారు బడులను ఊపిరిపోయాల్సిన అవసరం ఉందని.. అందుకే ఆ దిశగా ప్రణాళికలు రూపొందించామని చెబుతున్నారు. -
సూర్యాపేట- ఖమ్మం రహదారిపై ప్రమాదం
చివ్వెంల(నల్లగొండ): సూర్యాపేట- ఖమ్మం రహదారిపై ఎదురెదురుగా వచ్చిన కారు, ఆటో ఢీకొన్న ఘటనలో మహిళలు, చిన్నారులు సహా 14 మంది గాయపడ్డారు. నల్లగొండ జిల్లా చివ్వెంల మండల శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆటో సూర్యాపేట నుంచి ప్రయాణికులతో చివ్వెంల వస్తుండగా, కారు.. ఖమ్మం నుంచి సూర్యాపేట వైపునకు ప్రయాణిస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ 14 మందీ ఆటోలో ప్రయాణిస్తున్నవారే కావటం గమనార్హం. రోడ్డుపై పడిపోయిన క్షతగాత్రులను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.